'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Mar 14, 2013

మహంకాళి మూవీ రివ్యూ !!!???

మహంకాళి 

హీరో - రాజశేఖర్ 

రేటింగ్ - 0/5

కథ 

హీరో రాజశేఖర్ రెండు చేతులలో పిస్టల్స్ తో విలన్స్ ని షూట్ చేస్తూ ఉంటాడు. ఎవరినీ అరెస్ట్ చెయ్యడు. కేవలం షూట్ చేస్తూ చంపుతూ ఉంటాడు. 


విలన్ ప్రదీప్ రావత్ విదేశాలలో ఉంటాడు. రాజశేఖర్ చేతిలో చావడానికి క్లైమాక్స్ లో ఇండియా కి వస్తాడు. 

వీళ్ళిద్దరి మధ్య ఏమైంది. కథ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ధైర్యం చేసి టికెట్ కొనుక్కుని వెళ్ళండి 


పెర్ఫార్మన్స్ 

ప్రదీప్ రావత్ విదేశాలలో ఉండే ప్రతినాయకుడు. విదేశాలలో ఉండే వాడిలా అతని గెట్ అప్ లేదు. చాలా చీప్ గా, ఒక  వీధి రౌడీ లాగా కనిపిస్తాడు. 

మ్యూజిక్ డైరెక్టర్ కి ఏం చెప్పి మ్యూజిక్ కంపోజ్ చేయ్యమన్నారో ఎవరికీ అర్ధం కాదు. విచిత్రమైన ధ్వనులు ధియేటర్ లో వినిపిస్తాయి. వీటికి తోడు మధ్య మధ్య లో భయంకరంగా వినపడే "మహంకాళీ" అనే శబ్దాలు ధియేటర్ లో కనీసం కునుకు తీద్దామనుకున్న ప్రేక్షకులని హడలగొట్టి నిద్రలేపుతాయి. 


హైలైట్స్ 

అంటే ఏంటి 

డ్రా బాక్స్ 

వేరే చెప్పాలా 

హెచ్చరిక - మహంకాళి ది పనిషెర్..... అర్ధమైందా !!!!
- లాస్య రామకృష్ణ 

4 comments:

శ్యామలీయం said...

చాలా క్లుప్తంగా సూటిగా ఉన్న ఇలాంటి సినిమా రివ్యూ ఇంతకు ముందు మరొకటి చదివిన గుర్తులేదు.

Priya said...

భలే.. సింపుల్ గా పాయింట్ రీచ్ అయ్యేట్లు రాసారు లాస్య గారు. వీలైతే "గుండెల్లో గోదావరి" సినిమా గురించి కూడా రాద్దురూ.

Lasya Ramakrishna said...

శ్యామలీయం గారు మీకు నేను రాసిన రివ్యూ నచ్చినందుకు చాలా సంతోషం గా ఉంది.

Lasya Ramakrishna said...

ప్రియ గారు, మీకు ఈ రివ్యూ నచ్చినందుకు చాలా సంతోషం గా ఉంది. అమ్మో 'గుండెల్లో గోదావరి' సినిమా గురించి రివ్యూ రాసే స్టేజి కి నేనింకా ఎదగలేదండి:-)