'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Mar 19, 2013

రక రకాల ఐడియాలు ఇచ్చే అంజిగాడు, ఆ ఐడియాలు విని ఉహల్లొకి వెళ్ళిపోయే అమృతం

అమృతం 


అమృతం సీరియల్ గుర్తుందా? ఒకప్పుడు బుల్లితెరలో మన నట్టింట్లోకి వచ్చి మనందరికీ హాస్యామృతాన్ని పంచి ఇచ్చిన సీరియల్ ఇది. 


గుండు హనుమంతరావు, హర్షవర్ధన్ గొప్ప వినోదాన్ని పంచేవారు. 

వీరితో పాటు రాగిణి, సర్వం కూడా హాస్యాన్ని అందించడం లో తమ వంతు పాత్ర పోషించారు. 


ఈ సీరియల్ ప్రారంభం లో శివాజీరాజా టైటిల్ రోల్ పోషించేవాడు. ఆ తరువాత సీనియర్ హీరో నరేష్ ఆ స్థానాన్ని కొద్ది ఎపిసోడ్ల వరకు భర్తీ చేయ్యగలిగాడు. 

శివాజీ రాజా, ఝాన్సీ జోడితో కొన్ని ఎపిసోడ్లు నడిచాయి. అయితే వాళ్ళు ఈ సీరియల్ నుండి మాయమయి పక్క ఛానెల్ లో "ఆలస్యం అమృతం విషం" అనే ఇంకొక కామెడీ సీరియల్ లో ప్రత్యక్షమయ్యారు . అయితే ఆ సీరియల్ కామెడీ పండించడం లో విఫలమయింది. 

ఆ తరువాత హర్షవర్ధన్ టైటిల్ రోల్ పోషించేవాడు. 

ఆల్రెడీ హిట్ టాక్ వచ్చిన సీరియల్ అందులోనీ కామెడీ సీరియల్ లో మెయిన్ రోల్ లో కొత్తగా వచ్చి ప్రేక్షకుల అభిమానాలు పొందడం చాలా కష్టం. 

ఆ కష్టాన్ని సులభం గా అధిగమించాడు హర్శవర్ధన్. ప్రత్యేకమైన తన మేనరిజం తో అమృతం పాత్రలో జీవించాడు. 

ఇక అంజిగాడు అలియాస్ ఆంజనేయులు పాత్ర పోషించిన గుండు హనుమంతరావు విషయానికి వస్తే అతనికి సరైన గుర్తింపు ఈ సీరియల్ ద్వారా కలిగిందనే చెప్పాలి. 

ఇంకొక ముఖ్యమైన క్యారెక్టర్ అప్పాజీ. 

రక రకాల ఐడియాలు ఇచ్చే అంజిగాడు, ఆ ఐడియాలు విని ఉహల్లొకి వెళ్ళిపోయే అమృతం, చివరికి ఆ అయిడియాలు విఫలమవ్వడం. 

అప్పుడప్పుడు నేను యుట్యూబ్ లో ఈ సీరియల్ చూస్తూ ఉంటాను. 

ఆనందానికి మించి భోగం ఏమి లేదు కదా. 

మీ కోసం కొంచెం అమృతం, అమృతం రుచి చుడాలంటే వీటిని క్లిక్ చెయ్యండి. 


- లాస్య రామకృష్ణ 

4 comments:

venkat said...

చాల మంచి సీరియల్. ఇదొక్కటే చూసేవాన్ని.
మంచి రేటింగ్ ఉండి కూడా ఆపేసిన సీరియల్ బహుసా సీరియల్స్ చరిత్ర లో ఇదొక్కటే అనుకుంట.
కథలు లేకపోవడం వల్ల సీరియల్ ఆపెస్తున్నాం అని చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది.
మల్లి ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ???..
ఆ మధ్యన దీనిని సినిమా గా తీస్తారని విన్నాను సునీల్ హీరో గా..ఏమైందో మరి ఆ తరువాత ఆ వార్త కనపడలేదు.

srinivasarao vundavalli said...

ఈ సీరియల్ ఆపేసినపుడు చాలా బాభ కలిగింది. ఇప్పటికీ యూట్యూబ్ లో ప్రతి రోజు ఒక భాగం చూస్తూనే ఉంటాను :)
త్వరలో ఈ సీరియల్ సినిమాగా మన ముందుకు రాబోతుంది. ఎలా తీస్తారో ఏమో?

Lasya Ramakrishna said...

@ ఉండవల్లి శ్రీనివాస్ - అవునండి ఈ సీరియల్ త్వరలో 'చందమామలో అమృతం' గా సినిమా గా రాబోతోందిట. కనీ ఈ సినిమాలో హీరో అవసరాల శ్రీనివాస్ అట. ఎలా ఉండబోతోందో ఏమో!!!

Lasya Ramakrishna said...

వెంకట్ గారు, తెలుగు బ్లాగు సీ'రియల్' ముచ్చట్లు బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం. నేను కూడా ఈ సీరియల్ కి వీరాభిమానిని.