'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Mar 13, 2013

ఉమెన్స్ డే శుభాకాంక్షలు ఇలా కూడా తెలుపుతారా?


ప్రేక్షకులకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు అని ఒక సీరియల్ (కాంచన గంగ - మా టీవీ) కింద స్క్రోల్ అవుతోంది. అప్పుడు సీరియల్ లో ప్రసారమవుతున్న సన్నివేశం తన బర్త్ డే ఫంక్షన్ లో భర్త తన భార్య ని చెంపచెళ్ళుమనేల కొట్టడం. 


కనీసం ఉమెన్స్ డే రోజునైనా పగలు, ప్రతీకారాలు, కుట్రలు ఇవన్నీ పక్కన పెట్టి ఆహ్లాదకరంగా ఒక ఎపిసోడ్ ని ప్రసారం చెయ్యవచ్చు కదా!

బై డిఫాల్ట్ వాళ్ళు అలా డైరెక్ట్ చెయ్యడం అలవాటు పడ్డారేమో???
ఇలాంటి సీరియల్స్ యుగం లో కూడా కామెడీ పండించడానికి ప్రయత్నిస్తూ "గంగతో రాంబాబు" అనే సీరియల్ ని ఇంటూరి ఇన్నోవేషన్స్ బ్యానర్ పై వాసు ఇంటూరి దర్శకత్వం వహిస్తున్నాడు. 

వాసు ఇంటూరి గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. 


అమృతం సీరియల్ లో "సర్వం" గా ప్రసిద్ది చెందిన నటుడు. 

ఈ సీరియల్ అమృతం రేంజ్ లో లేకపోయినా పగలు, ప్రతీకారాలు పంధాని పక్కన పెట్టి హాస్య రసాన్ని ప్రధానంగా తీసుకున్నందువల్ల వాసు ఇంటూరి ని ప్రశంసించకుండా ఉండలేము. 

- లాస్య రామకృష్ణ 1 comment:

రాజి said...

నిజమేనండీ "గంగతో రాంబాబు" బాగుంటుంది సరదాగా...
ఈ మధ్య వస్తున్న సీరియళ్ళ లాగా కాకుండా :)