'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Feb 21, 2013

అందిన ద్రాక్ష తియ్యనద్రాక్ష ని ఆహారం లో తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఎన్నో. అత్యంత పోషక విలువలు కలిగిన ద్రాక్ష ఆరోగ్యాన్ని అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలని నిర్మూలించడం లో ద్రాక్ష పండు ప్రధాన పాత్ర పోషిస్తుందనడం లో సందేహం లేదు. అజీర్ణం, మలబద్దకం, మూత్రపిండాల సమస్యలు, ఆయాసం, అలసట, నీరసం, దృష్టి లోపములు, కంటి శుక్లాల నివారణ మొదలగు సమస్యల బారిన పడకుండా ద్రాక్ష తోడ్పడుతుంది. అత్యంత రుచికరమైన పళ్ళ లో ఒకటైన ద్రాక్షలో ఎ, సి, బి6 మరియు ఫోలేట్ విటమిన్లతో పాటు పొటాషియం, కాల్సియం, ఐరన్, ఫొస్ఫరస్, మెగ్నీషియం మరియు సేలేనియం వంటి మినరల్స్ కలవు.ద్రాక్ష వల్ల నయమయ్యే వివిధ రకాల ఆరోగ్య సమస్యలు

ఆస్థమా :- ద్రాక్షలో ఉన్న ఔషదపరమైన గుణాలు ఆస్థమాను నయం చెయ్యడానికి ఉపయోగపడతాయి. గుండె సంబంధిత వ్యాధులు :- రక్తం లో ని నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలని పెంచడం ద్వారా రక్తం గడ్డ కట్టడాన్ని ద్రాక్ష నిరోధిస్తుంది. అందువల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. రక్తనాళాలని అడ్డగించే చెడ్డ కొవ్వు ని నిర్మూలించడానికి కూడా ద్రాక్ష ఉపయోగపడుతుంది. మైగ్రేన్ : ఉదయాన్నే ద్రాక్ష రసం తీసుకోవడం వల్ల మైగ్రేన్ సమస్య నుండి బయటపడవచ్చు. మలబద్దకం : మలబద్దక సమస్యకు విరుగుడు ద్రాక్ష. అజీర్ణం : అజీర్తి ని నయం చేసేందుకు ద్రాక్ష ముఖ్య పాత్ర పోషిస్తుంది. వేడి ని తగ్గించి పొట్టకి ఉపశమనం కలిగిస్తుంది. 


ద్రాక్ష వల్ల నయమయ్యే మరికొన్ని ఆరోగ్య సమస్యల గురించి తరువాతి టపాలో తెలుసుకుందాం.... 


- లాస్య రామకృష్ణ 

No comments: