హాయ్ ఫ్రెండ్స్,
ఎన్నో ప్రేమికుల రోజులు వస్తూ ఉన్నాయి. పోతూ ఉన్నాయి. ప్రేమకి ఒక రోజు అవసరమా? లేక ఈ రోజు ప్రత్యేకంగా ఎన్ని పనులున్న ప్రియమైన వారి కోసం కేటాయించాలనా.
ఇవన్నీ ఎందుకులెండి. అసలు విషయానికి వచ్చేద్దాం. ఈ ప్రేమికుల రోజు నాడు మీ ప్రియమైన వారిని ఎలా సంతోషపెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ టపా మీ కోసమే.
ప్రేమికుల రోజు ని మరింత ప్రత్యేకంగా జరుపుకునేందుకు కొన్ని చిట్కాలు
1.కానుకలు
ఏవైనా కానుకలని మీ ప్రియమైన వారికి బహుకరించండి. ఎప్పటినుంచో కొనుక్కోవాలని ఎదురు చూస్తున్న వస్తువు ని బహుకరిస్తే ఎంతో సంతోషిస్తారు.
2.ట్రిప్
ప్రేమికుల రోజు ప్రత్యేకంగా ఏదైనా ట్రిప్ ప్లాన్ చెయ్యండి. సరదాగా రెండు రోజుల ట్రిప్ లేదా మూడు రోజుల ట్రిప్ ప్లాన్ చెయ్యండి. ఈ గజిబిజి జీవన నేపధ్యం లో నుండి దూరంగా చక్కటి ప్రకృతి ఒడిలో హాయిగా గడిపి రండి.
3.హోటల్
ఏదైనా మంచి హోటల్ కి వెళ్లి భోజనం చేసి రండి. ప్రశాంతం గా ఉండే హోటల్ ని ఎంచుకుని మీ భాగస్వామిని తీసుకుని వెళ్ళండి.
4.ఇంట్లో
ఇంట్లో కూడా ప్రేమికుల రోజుని అద్భుతంగా జరుపుకోవచ్చు. ఎలాగంటారా? చక్కగా మీ చేతితో మీ భాగస్వామికి నచ్చిన వంటకాలని వండండి. ప్రేమికుల రోజు కోసం హృదయాకారం లో ఉన్న టేబుల్ మాట్స్ తో మీ డైనింగ్ టేబుల్ ని అలంకరించండి. ఒక చక్కటి ఫ్లవర్ వాజ్ ని డైనింగ్ టేబుల్ కి మధ్యలో అమర్చండి. ఫ్లవర్ వాజ్ చుట్టూ కొవ్వొత్తులని ఒక డిజైన్ లో వెలిగించండి. మత్తెక్కించే రూం స్ప్రే ని చల్లండి. మీ ఇద్దరికీ నచ్చిన సినిమా సి డి ని ప్లే చేస్తూ, చక్కగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చెయ్యండి.
కెమెరా ని ఆటో మోడ్ లో ఉంచి ఇద్దరు కలిసి ఈ ప్రేమికుల రోజు సందర్భంగా తయారు చెయ్యబడిన విందు దగ్గర ఫోటో దిగడం మాత్రం మరచిపోవద్దు.
మరి మీకు తెలిసిన చిట్కాలు నాతో పంచుకుంటారా....
- లాస్య రామకృష్ణ
No comments:
Post a Comment