'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Jul 16, 2012

ఆమె ఎవరు part 2

జరిగిన కథ :-


 ఏ వార్తా లేని న్యూస్ ఛానల్ రిపోర్టర్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న ఒక మధ్యతరగతి మహిళపై ఒక సెన్సేషనల్ న్యూస్ టీవిలో టెలికాస్ట్ చేస్తాడు. 

అలాగే తన నడకలో ఏ మాత్రం వేగం లేకుండా నడుచుకుంటున్న ఆమె ఈ  సారి ఒక టీవీ సీరియల్ డైరెక్టర్ కంట పడింది. తరవాత ఎం  జరిగిందో మిరే  చదవండి.

ఇప్పటికే 1050 ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్న "ఇది అంతం కాదు ఆరంభం" అనే సీరియల్ లో ఎన్ని రకాల ట్విస్ట్ లు వాడాలో ఎన్ని రకాల పాత్రలని రంగంలోకి దించాలో అన్ని రకాల ప్రయోగాలు చేసిన ఆ డైరెక్టర్ కి ఇంక  ఎలా కథని ముందుకు నడిపించాలో అర్ధం కాకుండా డీలా పడిపోయి ఉన్నాడు. అలా కొంచెం రిలాక్ష్ అవుదామని బయటికి వచ్చిన అతనికి ఇలా నడుచుకుంటూ వెళుతున్న మన "ఆమె" కనిపించింది.ఇంతలో అతనికి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది.

"హమ్మయ్య, మన సీరియల్ ముందుకు సాగేందుకు దొరికిందొక ఐడియా, శభాష్ బుచ్చిబాబు" అని తనని తనే పోగుడుకుని క్షణం ఆలస్యం చెయ్యకుండా కేమెరామాన్ తో సహా అందరిని అక్కడికే రమ్మని షూటింగ్ ని "ఆమె" కి తెలియకుండా సిక్రెట్ గా స్టార్ట్ చేసాడు. ఎందుకంటే సహజత్వం మిస్ అవకూడదని.

కెమెరామాన్ ఆమె ని క్లోజ్ అప్ లో రక రకాలుగా షూట్ చేస్తుండగా మన మాటల రచయిత మేల్కొన్నాడు.

"నేను ఎందుకు నడుస్తున్నాను. ఇంత ఎండలో ఎందుకు నడుస్తున్నాను. అసలు ఎటు వైపు నడుస్తున్నాను. 
అసలు నా పేరేమిటి. ఇక్కడికి ఎలా వచ్చాను. నేను ఎవరు. ఇంతకీ నేను ఏం  చదువుకున్నాను. నేను ఎక్కడికి వెళుతున్నాను. అసలు నా చెతిలొ ఈ కురగాయాల సంచీ ఏమిటి." ఇలా స్వగతం లో "ఆమె" మాట్లాడినట్టుగా 1051 ఎపిసోడ్ షూటింగ్ పూర్తిచేసుకుంది.


- లాస్య రామకృష్ణ 


No comments: