'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Jul 21, 2012

అడవిలో ఆడపిల్ల...

నాకీ మధ్య ఒక ఇంట్రెస్ట్ ఏర్పడింది. అదేంటంటే ఒక సినిమా తీద్దామని. 

అంతే, ఇంకా ఒక్క క్షణం ఆలస్యం చెయ్యకుండా నేను కథ రాసుకోవడం స్టార్ట్ చేసుకున్నాను.

ఆ కధేంటంటే....

అడవి చూడడానికి హీరోయిన్ ఒంటరిగా వెళ్తుంది. ఒంటరిగా వెళ్ళడానికి కారణం ఏమి లేదు. తెలుగు సినిమా హీరోయిన్ లక్షణం ఏంటంటే ఒంటరిగా ఎక్కడికైనా వెళ్తుంది. ఎందుకంటే, హీరోయిన్ ఇబ్బందుల్లో ఉందనగానే హీరో 
ప్రత్యక్షమవవుతాడనే ధీమా.

అలా ఒక సోలో సాంగ్ పడుకుంటుంది. ఆ పాట పల్లవి 

"అడవి అడవి అడవి   
అందమైన అడవి 
ముచ్చటైన అడవీ 
మరపురాని అడవి" అని "ఈగ పాట ట్యూన్ లో శ్రేయా ఘోషల్ గొంతులో పాడుకుంటుంది. కట్ చేస్తే, మన హీరో కూడా అడవి చూడ్డానికి వచ్చాడు. అక్కడ జంతువులలో జంతువులలా తిరుగుతున్న మన హీరోయిన్ ని చూసి అడవి మనిషి అనుకుంటాడు.

అలాగే, హీరో ని చూసి హీరోయిన్ కూడా అడవి మనిషని అనుకుంటుంది. 

అదేదో సినిమాలో అడవి మనిషిని మాములు మనిషిని చేసిన హీరోయిన్ ని చూసిన మన హీరోయిన్ అడవి మనిషిలా  భ్రమ పడిన హీరోని కూడా మాములు మనిషిని చేయ్యలనుకుంటుంది. 

ఇంత అందమైన అమ్మాయి అడవి మనిషిలా ఉండకూడదని మాములు మనిషిని చెయ్యాలని ఒక వైపు హీరో అనుకుంటాడు.

ఇద్దరూ ఒకరి తో ఒకరు సైగ ల భాష లో మాట్లాడుకుంటారు. అనుకోకుండా ప్రేమలో పడతారు.

ఇలా ఆకులూ అలమలూ తింటూ కలం గడుపుతున్న ఈ అడవి ప్రేమికులని విడదీయడానికి ఒక హెలికాఫ్టర్ లో హీరోయిన్ వాళ్ళ నాన్న వచ్చి హీరోయిన్ ని తీసుకెళతాడు. 

ఇక్కడ వరకే కథ రాసానండి...

ఆ  తర్వాత ట్విస్ట్ మీరు చెప్పరూ ....

- లాస్య రామకృష్ణ 
2 comments:

Anonymous said...

అమ్మ బాబోయ్ తెనుగు సినిమానా ట్విస్టా
అసాధ్యం తల్లో!!!

గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు said...

కొసమెరుపు ఏమిటంటే
"అమ్మయికి పెళ్ళంటే ఇష్టం లేదు. అబ్బయికి పెళ్ళంటే భయం"
ఇద్దరినీ కలపడానికి పెద్దవాళ్ళు ఇద్దరినీ అడవులో కలుసుకునే ఏర్పాటు చేస్తారు.
ఇంతకన్నా ఏముంది నాకైతే పాత మూస ధోరణిలో "అమ్మాయి కోసం అబ్బాయి ౧౦౦ మందిని కొట్టడం ఇష్టంలేదు" అందుకే ఈ ముగింపు.