'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Dec 28, 2011

పాడుతా తీయగా

      సంగీత ప్రపంచంలోకి అభిమానులని తీసుకుని విహరింప చేస్తున్న కార్యక్రమం పాడుతా  తీయగా.  ఈ టీవీ లో ప్రతి సోమవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది ఈ ప్రోగ్రాం. 

     శ్రీ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఈ ప్రోగ్రాంకి వాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. పార్తిసిపంట్స్ పాడే పాటలతో పాటు ఆ పాటతో తనకి కలిగిన అనుబంధాన్ని వివరిస్తూ ప్రేక్షకులని కట్టిపడేస్తున్నారు.

       అంతే కాదు ఈ కార్యక్రమంకి జడ్జీగ వచ్చిన వాళ్ళు సైతం ఆకట్టుకుంటున్నారు. ఈ వారం ప్రోగ్రాంకి వనమాలి గీత రచయిత విచ్చేసారు. తను రాసిన పాటల గురించి మాట్లాడారు. ఇంకా తను ఏ పాటకు కష్టపడ్డారో కూడా తెలియజేసారు. అయన తెలియ జేసినా పాటలలో నన్ను విశేషం గ ఆకట్టుకున్న పాట "నిన్న లేని వింతలే చూపెనే కంటిపాపలే". ఈ పాట సిద్ధార్ద్ నటించిన "180 " చిత్రం లోనిది. ఈ పాట రాయడానికి వనమాలి గారికి నెల రోజులు పట్టిందట. ఇటువంటి పాటలకి అవార్డ్స్ రావాలని బాలసుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. 

 ఎంతైనా సంగీతమనే లోకంలోకి ఈ ప్రోగ్రాం ద్వార మనలాంటి ప్రేక్షకులని తీసుకెళుతూ మనకి ఆనందాన్ని కలిగింపచేస్తున్న బాలసుబ్రహ్మణ్యం గారికి, ఈ టీవీ వారికీ మనందరి తరపున నా అభినందనలు. 

ప్రేక్షకుల స్పందన
"ఇప్పుడు వస్తున్న మ్యూజిక్ ప్రోగ్రామ్స్ అన్నిటిలోకి మిన్న ఈ టీవీ వారి పాడుతా తీయగా" - సుభద్రా దేవి.

 

No comments: