'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Dec 23, 2011

జై శ్రీకృష్ణ - అదుర్స్


జెమిని టీవీ లో సాయంత్రం ఆరు గంటలకు ప్రసారమవుతున్న జై శ్రీకృష్ణ సీరియల్ ఎంతో మంది అభిమానుల ఆదరాభిమానాలను పొందుతోంది. ప్రత్యేకించి ఈ సీరియల్ లో చెప్పుకోవలసిన విషయమేమిటంటే, ఇందులో నటించిన ద్రుతి భాటియా (చిన్ని కృష్ణుడు) అందరి మన్ననలు అందుకుంటోంది, చిన్నారులను ఎంతో ఆకట్టుకుంటోంది.
 ప్రస్తుతం ఎవ్వరు మాట్లాడుకున్న ధృతి భాటియా గురించే మాట్లాడుకుంటున్నారు. అంతగా శ్రీకృష్ణుడి పాత్రలో ఆ అమ్మాయి లీనమైపోయింది.
రెండు సంవత్సరాల  పది నెలల ప్రాయంలోనే అద్భుతమైన నటనను ప్రదర్శిస్తూ టాక్ అఫ్ ది ఇండియన్ టెలివిజన్ అయ్యింది ధృతి. తను రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు షూటింగ్ లో పాల్గుంటుంది.
తను చాల అల్లరి పిల్ల అని, షూటింగ్ బ్రేక్ లో మస్తీ చేస్తుందని ఆమె తండ్రి చెబుతున్నారు.
అంత చిన్న వయసులో ఆమె అద్బుతమైన నటనను చుసిన వాళ్ళు పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెతను గుర్తుచేసుకుంటున్నారు.
స్క్రిప్ట్ ను చదివి ధృతి కి అర్ధం అయ్యేటట్టు చెప్తాము అని ధృతి తండ్రి చెప్పారు.
దేవుడి దయ వల్లే తమ కూతురి ఇంత చిన్న వయసులోనే అంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందని  అతను తన ఆనందాన్ని వ్యక్తం చేసారు.

ప్రేక్షకుల స్పందన
"చిన్నితెర మీద జై శ్రీకృష్ణ ఆధ్యాత్మిక విప్లవం. ఇందులో నటిస్తున్న కళాకారుల ప్రతిభ అనుపమానం అసమానం. చూస్తున్న కొద్ది చూడాలనిపించే కళా సృజనకు జోహారు" - నాగ సాయి రమ్య, సికింద్రాబాద్.No comments: