'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

May 30, 2018

మా చంటిదాని ఎఫెక్ట్

మొన్నామధ్య నేను బ్లాగ్ రాద్దామని కూర్చున్నాను. ఎదో పనుందని అలా వెళ్లి ఇలా వచ్చేసరికి మూడేళ్ళ మా చంటిపిల్ల బ్లాగ్ లో ఏవేవో అక్షరాలు రాసి పబ్లిష్ చేసి విండొని క్లోజ్ కూడా చేసేసింది. మా చంటిదాని రాతలు ఈ రోజు బ్లాగ్ ని ఓపెన్ చేసే వరకు నాకు తెలియలేదు. ఈ పాటికి మీకు అర్థమై ఉండుంటుంది బ్లాగ్ కి నేనెందుకు విరామం ఇచ్చానో. రెప్పపాటు కాలంలో ఇలాంటి విచిత్రాలెన్నింటినో నేను ఈ మూడేళ్ళలో గమనిస్తూ వస్తున్నాను. పాప పుట్టినప్పటి నుంచి నా ఆలోచనా దృక్పథం మారింది(మారాల్సి వచ్చింది). అలాగే, నాలో సహనం పెరిగింది(చచ్చినట్టు పెరిగింది, లేకపోతే ఈ అల్లరి పిల్లతో వేగగలనా?) .  ఆ విచిత్రమైన పోస్ట్ కు నా బ్లాగ్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారు, లేదా అప్పుడే కొత్తగా బ్లాగ్ లోకం లోకి ఎంటర్ అయినా వారు ఎవరైనా కాస్త (చాలా) కన్ఫ్యూజన్ కు గురైతే (రోజూ దాని చేష్టలతో నాకు ఆటోమేటిక్ గా ఇది ఒక లక్షణంగా మారిపోయింది) ఈ పోస్ట్ మీకు క్లారిటీ ఇస్తుందని ఆశిస్తున్నాను. 
(మనసులో మాట - మొత్తానికి మా చంటిది మొదటి బ్లాగ్ పోస్ట్ ను మూడేళ్ళ వయసులోనే పోస్ట్ చేసిందన్న మాట.) 

లాస్య రామకృష్ణ

No comments: