కొన్నిసార్లు మనం చాలా నిరాశకు, నిస్పృహకు లోనయ్యే పరిస్థితి ఎదురవవచ్చు. లైఫ్ అంటేనే కష్టసుఖాల కలయిక. అలాంటప్పుడు దేవుడిని తలచుకుని మన చుట్టూ ఉన్న సూపర్ నేచురల్ పవర్ మనకెప్పుడూ పాజిటివ్ ఎనర్జీని పంపిస్తుంది అని బలంగా నమ్మి రిలాక్స్ అవ్వాలి. ఎందుకంటే, మనం బాధపడితే ప్రయోజనం ఉండదు. బాధపడితే మన టైం వెస్ట్ అవుతుంది. పరిస్థితిని ఇంకా బెటర్ గా తీర్చిదిద్దుకునే విలువైన సమయాన్ని అలాగే అవకాశాన్ని కోల్పోతాము. కరిగిపోయిన కాలాన్ని ఎవరూ తిరిగి తీసుకురాలేరు. కాలం మన చేతిలో నున్న విలువైన ఆస్తి. దానిని సవ్యంగా ఉపయోగించుకుంటే ఆకాశమే హద్దు. ఇప్పుడు నాకొక కోట్ గుర్తుకొస్తోంది. 'పరిస్థితులు అనుకూలంగా లేవని ఏడుస్తూ కూర్చుంటే కన్నీరు మబ్బుతెరలతో ఎదురుగానున్న అవకాశాలను గుర్తించడం కష్టం'.

No comments:
Post a Comment