'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Showing posts with label సరదాగా కాసేపు. Show all posts
Showing posts with label సరదాగా కాసేపు. Show all posts

Jul 29, 2013

"స్వర్ణ కమలం" సినిమా లో కొన్ని సన్నివేశాలు నాకు నచ్చలేదు.


కళాతపస్వి విశ్వనాధ్ గారు దర్శకత్వం వహించిన సినిమా. మానవతా విలువలు ఏమాత్రం కనిపించని సినిమాలు వస్తున్న సమయం లో తెలుగుతనాన్ని, కమ్మదనాన్ని సినిమాలో చక్కగా వడ్డించిన గొప్ప దర్శకుడు. 

కాని స్వర్ణ కమలం సినిమా లో కొన్ని సన్నివేశాలు నాకు నచ్చలేదు. అసలు ఆ సినిమానే నచ్చలేదు. 

అంధుడైన ఒక గొప్ప నాట్యకారుడికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద అమ్మాయి సంగీత సరస్వతి. చిన్నమ్మాయి ఆధునిక భావాలు కలిగిన యువతి. ఈ కళలు కడుపు నింపవు అనే ఆలోచన కలిగిన అమ్మాయి. ఒక విధంగా కళల పట్ల ద్వేషం పెంచుకున్న అమ్మాయి. 

అటువంటి అమ్మాయి ని బలవంతంగా నాట్యగత్తె గా మార్చాలని వెంకటేష్ విశ్వ ప్రయత్నం చేస్తాడు. సహజంగా ప్రతిభ ఉన్నవాళ్ళని ప్రోత్సహించడం లో తప్పు లేదు. కాని, ఆ అమ్మాయి కి వద్దు బాబోయ్ అన్నా ఏదో ఒక విధంగా ఆమెను నాట్యం వైపు మరల్చాడని ప్రయత్నిస్తూ ఉంటాడు. అతని ఉద్దేశ్యం మంచిదే అయి ఉండవచ్చు, కానీ అతను డీల్ చేసిన విధానం సబబు గా లేదు. అనవసరంగా మధ్యలో భానుప్రియ తండ్రి మరణానికి కారకుడవుతాడు. 

కొన్ని కొన్ని సన్నివేశాలలో అయితే భానుప్రియని వేధించుకు తింటున్నాడు అనిపించింది. 

ఏంతో మంది పేద కళాకారులు ఎవరైనా తమని గుర్తించాలని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని  ప్రోత్సహించినా ఒక అర్ధం ఉండేది. 



- లాస్య రామకృష్ణ 



Jun 28, 2013

మనం చిన్నప్పుడు విన్న జానపద కథలని గుర్తుకు చేస్తుంది ఈ చిత్ర కథ.


మనం చిన్నప్పుడు విన్న జానపద కథలని గుర్తుకు చేస్తుంది ఈ చిత్ర కథ. తప్పక చూడాల్సిన చిత్రం. వాల్ట్ డిస్నీ ఎనిమేషన్స్ ఆశ్చర్యం కలిగించేంత అందంగా ఉంటాయి. అవి కేవలం బొమ్మలని అంటే నమ్మశక్యం కాదు. ప్రతి పాత్రలో జీవం ఉట్టిపడుతుంది. 

చిత్ర కథ క్లుప్తంగారాజ వంశానికి చెందిన అమ్మాయిని ఒక మంత్ర గత్తె అపహరించుకుని వెళ్లి ఎత్తైన కోటలో బంధిస్తుంది. ఆ అమ్మాయి కి ఉన్న పొడవాటి శిరోజాల అద్భుత శక్తిని ఉపయోగించుకునేందుకు ఆ మంత్ర గత్తె ఆమెను బంధిస్తుంది. బయట ప్రపంచాన్ని చూడాలనే ఉత్సాహం రోజు రోజు కి పెరగడం వల్ల అనుకోకుండా ఆ కోటలోకి ప్రవేశించిన ఒక దొంగ సహాయం తో ఆ అమ్మాయి తప్పించుకుంటుంది. 

ఆ తరువాత జరిగే పరిణామాల వల్ల తను ఎంతో మంచిదని నమ్మిన మంత్రగత్తె మోసగత్తె అని తెలుసుకుంటుంది. చివరికి తన తల్లి దండ్రుల చెంతకు చేరుతుంది. వారి అంగీకారంతో తనని మంత్రగత్తె నుండి రక్షించిన దొంగని పెళ్లి చేసుకుంటుంది. 

హైలైట్స్ - నాయికతో పాటు ఉండే కప్ప, మధ్యలో ప్రవేశించే గుర్రం పాత్ర ఇంకా ఒక దొంగల ముఠా ల వద్ద నాయకానాయికల పాట ఇంకా ఎన్నో ఈ చిత్రం లో ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. 
- లాస్య రామకృష్ణ 


Mar 29, 2013

పెదవులు పగడ కాంతులు

పెదవులు పగడ కాంతులు 
పలుకులు చెరుకు బంతులు 

నడకలు నెమలి గంతులు 
గల గల గలలు
కనులలో కోటి రంగులు

నడుములో మర ఫిరంగులు 

కురులలో జలధి పొంగులు 


 జల జల జలలు


 తన కొరకే కలవరమే 

 తన వరకే చెలి స్వరమే 

 తన దరికే 

నా ప్రాణమే ప్రయాణమే  



- లాస్య రామకృష్ణ 






Mar 24, 2013

సగటు భార్య తన భర్త లో ఆశించే లక్షణాలు



1. గొంతెమ్మ కోరికలు అడిగి భార్య ఎప్పుడూ భాధ పెట్టదు కాబట్టి అప్పుడప్పుడు అడిగిన డైమండ్ నెక్లెస్ లు తెచ్చిపెట్టాలి. 

2. రోజూ వంట చేసి అలసిపోతుంది కాబట్టి అప్పుడప్పుడూ భర్త తనే స్వయంగా వంట చేసి వడ్డించాలి.


3. షాపింగ్ లకి వెళ్ళినప్పుడు ఎటువంటి డిస్టర్బ్ఎన్స్ చెయ్యకుండా వీలయితే షాపింగ్ లో తోడ్పడాలి. అందుకే షాపింగ్ అని తెలియగానే ఉదయాన్నే తీసుకువెళ్ళాలి. 


4. అడిగినప్పుడల్లా పుట్టింటికి పంపించాలి. 


5. "ఏవండీ బయటికి తీసుకెళ్ళండి" అని అడగగానే ఆఫీసు కి సెలవు పెట్టినా సరే బయటికి తీసుకువెళ్ళాలి. 



6. కొత్త సినిమా రిలీజ్ అయిన వెంటనే సినిమాకి తీసుకువెళ్ళాలి. 


7. నెలకొక సారి కుదిరితే వారానికి ఒక సారి ఏదైనా లాంగ్ ట్రిప్ ప్లాన్ చెయ్యాలి. 


8. టీవీ చూస్తున్నప్పుడు అందులోనూ డైలీ సీరియల్ చూస్తున్నప్పుడు అస్సలు డిస్టర్బ్ చెయ్యకూడదు. 


ఇవి మచ్చుకు కొన్ని. ఇంకా భార్య భర్త లోంచి ఆశించేవి బోలెడు. ఇన్ బిల్ట్ టాలెంట్ తో ప్రోయాక్టివ్ గా భార్య మనసెరిగి దుసుకుపోవాలి మరి. 


- లాస్య రామకృష్ణ   



Feb 12, 2013

ప్రేమికులకు చిట్కాలు

హాయ్ ఫ్రెండ్స్,

ఎన్నో ప్రేమికుల రోజులు వస్తూ ఉన్నాయి. పోతూ ఉన్నాయి. ప్రేమకి ఒక రోజు అవసరమా? లేక ఈ రోజు ప్రత్యేకంగా ఎన్ని పనులున్న ప్రియమైన వారి కోసం కేటాయించాలనా. 

ఇవన్నీ ఎందుకులెండి. అసలు విషయానికి వచ్చేద్దాం. ఈ ప్రేమికుల రోజు నాడు మీ ప్రియమైన వారిని ఎలా సంతోషపెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ టపా మీ కోసమే. 

ప్రేమికుల రోజు ని మరింత ప్రత్యేకంగా జరుపుకునేందుకు కొన్ని చిట్కాలు

1.కానుకలు 



ఏవైనా కానుకలని మీ ప్రియమైన వారికి బహుకరించండి. ఎప్పటినుంచో కొనుక్కోవాలని ఎదురు చూస్తున్న వస్తువు ని బహుకరిస్తే ఎంతో సంతోషిస్తారు. 

2.ట్రిప్ 



ప్రేమికుల రోజు ప్రత్యేకంగా ఏదైనా ట్రిప్ ప్లాన్ చెయ్యండి. సరదాగా రెండు రోజుల ట్రిప్ లేదా మూడు రోజుల ట్రిప్ ప్లాన్ చెయ్యండి. ఈ గజిబిజి జీవన నేపధ్యం లో నుండి దూరంగా చక్కటి ప్రకృతి ఒడిలో హాయిగా గడిపి రండి.

3.హోటల్ 


ఏదైనా మంచి హోటల్ కి వెళ్లి భోజనం చేసి రండి. ప్రశాంతం గా ఉండే హోటల్ ని ఎంచుకుని మీ భాగస్వామిని తీసుకుని వెళ్ళండి. 

4.ఇంట్లో 

ఇంట్లో కూడా ప్రేమికుల రోజుని అద్భుతంగా జరుపుకోవచ్చు. ఎలాగంటారా? చక్కగా మీ చేతితో మీ భాగస్వామికి నచ్చిన వంటకాలని వండండి.  ప్రేమికుల రోజు కోసం హృదయాకారం లో ఉన్న టేబుల్ మాట్స్ తో మీ డైనింగ్ టేబుల్ ని అలంకరించండి. ఒక చక్కటి ఫ్లవర్ వాజ్ ని డైనింగ్ టేబుల్ కి మధ్యలో అమర్చండి. ఫ్లవర్ వాజ్ చుట్టూ కొవ్వొత్తులని ఒక డిజైన్ లో వెలిగించండి. మత్తెక్కించే రూం స్ప్రే ని చల్లండి. మీ ఇద్దరికీ నచ్చిన సినిమా సి డి ని ప్లే చేస్తూ, చక్కగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చెయ్యండి. 

కెమెరా ని ఆటో మోడ్ లో ఉంచి ఇద్దరు కలిసి ఈ ప్రేమికుల రోజు సందర్భంగా తయారు చెయ్యబడిన విందు దగ్గర ఫోటో దిగడం మాత్రం మరచిపోవద్దు. 

మరి మీకు తెలిసిన చిట్కాలు నాతో పంచుకుంటారా....


- లాస్య రామకృష్ణ  








Feb 2, 2013

"ఒంగోలు గిత్త" లో నగ్నం గా నటించిన ప్రకాష్ రాజ్ - ఈ సినిమా చూసే సాహసులు ఎవరో?

"ఒంగోలు గిత్త" సినిమాలో నగ్నంగా నటించిన ప్రకాష్ రాజ్ అని ఈ మధ్య ఒక న్యూస్ పేపర్ లో చదివాను.

హీరో రామ్ సినిమాలు ఏంతో ఆసక్తికరంగా ఉంటాయి.

కుటుంబ సమేతంగా చూసే లా ఉండే సినిమాలు దర్సకత్వం వహించడం లో భాస్కర్ పేరొందినవాడు.

ఈ రెండు కారణాల రీత్యా ఈ సినిమా చూడాలని అనుకున్నాను. 

కానీ వార్తల్లో ఈ కొత్త స్టేట్ మెంట్ చూసాక ఈ సినిమా చూడాలన్న ఆలోచన విరమించుకున్నాను.

మరి ఇలాంటి ఆలోచన భాస్కర్ కి ఎందుకు కలిగిందో. నాకైతే ఈ సినిమా చూడాలనే ఆసక్తి సన్నగిల్లింది.




Jan 28, 2013

ఒక హాస్పిటల్ కిటికీ అవతల



ఒక హాస్పిటల్ వార్డ్ లో ఇద్దరు రోగులు ఉన్నారు. వారిలో ఒక రోగి ఎల్లప్పుడూ మంచం పై పడుకునే ఉండాలి. మరొక రోగి ఆరోగ్య కారణాల రీత్యా రోజుకు ఒక గంట సేపు లేచి కూర్చోవాలి. ఈ రోగి బెడ్ పక్కనే కిటికీ ఉండేది.

రోజుకొక గంట సేపు లేచి కూర్చునే రోగి ఆ కిటికీ అవతల ఉన్న అందమైన ప్రపంచం గురించి ఎల్లప్పుడూ పడుకుని ఉండే రోగి కి వర్ణించేవాడు. ఆ రోగి మంచం మీదే అందమైన రంగు రంగుల ప్రపంచాన్ని తోటి రోగి మాటల్లో చూసే వాడు.

"కిటికీ అవతల ఒక అందమైన సరస్సు ఉంది. ఈ సరస్సులో బాతులు తిరుగుతూ ఉంటాయి. పక్కనే చిన్న పిల్లలు ఆడుకోవడానికి వస్తున్నారు. సూర్యాస్తమయం ఏంతో అందంగా ఉంది." ఇలా వర్ణిస్తూ ఉండేవాడు.

కిటికీ అవతల ఉన్న అందమైన ప్రపంచాని తనకు కూడా చూడాలని అనిపించేది. ఆ ఒక్క గంట ఎంతో సంతోషంగా ఉండేది.

ఒకా నొక రోజున కిటికీ వద్ద బెడ్ మీద ఉండే ఈ రోగి చనిపోయాడు. అప్పుడు నర్స్ ని ఎల్లప్పుడూ మంచం పైన ఉండే ఈ రోగి తన బెడ్ ని కిటికీ వద్ద ఉండే బెడ్ దగ్గరికి మార్చమని కోరుకున్నాడు.

వెంటనే తన స్థానం కిటికీ వద్ద ఉన్న బెడ్ వద్దకి మారగానే అతి కష్టం మీద లేవడానికి ప్రయత్నించి లేచి కుర్చుని కిటికీ అవతల ఉన్న అద్భుతాలని తిలకించాలని ఆనందంగా చూసాడు.

ఆశ్చర్యం. ఆ కిటికీ అవతల ఎత్తైన గోడ మాత్రమే ఉంది. ఇంకేమీ కనపడలేదు.

- లాస్య రామకృష్ణ 

Jan 19, 2013

నా ప్రశ్నకి మీ జవాబు


1. నేతాజీ సుభాష్ చంద్రబోసు "ఇండియన్ నేషనల్ ఆర్మీ'ని ఏ నగరంలో స్థాపించారు?

a.సింగపూర్ 
b.రంగూన్ 
c.టోక్యో  
d.తైవాన్ 

- లాస్య రామకృష్ణ 


Jan 16, 2013

ప్రతి రోజు మా ఇంటి ముందు నుండి మాయమవుతున్న న్యూస్ పేపర్

గత కొన్ని రోజుల నుండి మా ఇంటి ముందు న్యూస్ పేపర్ నేను రోజు పేపర్ తీసే సమయం లో ఉండట్లేదు. అయితే మధ్యాహ్నం మాత్రం కనిపిస్తుంది. ఉదయాన్నే ఉండాల్సిన పేపర్ మధ్యాహ్నం వస్తుంది. పేపర్ ఏజెంట్ కి ఫోన్ చేసి అడిగితే ఉదయాన్నే పేపర్ వేస్తున్నట్టు చెప్పాడు. 

రోజు లేచే సమయం కంటే కాస్త ముందుగా అసలు విషయం ఏమిటో తెలుసుకోవడానికి లేద్దాం అని అనుకున్నాను. తెల్లవారుజామునే లేచి చూసాను. పేపర్ ఇంకా రాలేదు. అలా చూస్తూనే ఉన్నాను. మా డోర్ కి ఉన్న పీప్ హోల్ ద్వారా గమనించడం ప్రారంభించాను. పేపర్ వాడు వొచ్చి మా ఫ్లోర్ లో ఉన్న మూడు ఇళ్ళకి పేపర్ చక చకా వేసి వెళ్ళిపోయాడు. నేను కావాలనే పేపర్ తీసుకోకుండా పేపర్ ఎలా మయమవుతుందో తెలుసుకోవడానికి ఎదురు చూస్తున్నాను. వెంటనే మా పక్క ఫ్లాట్ డోర్ ఓపెన్ అయింది. మా ఇంటి ముందున్న పేపర్ ని తీసుకోబోతున్న సమయం లో నేను వెంటనే డోర్ తెరిచాను. "హి హి హి" అని ఒక వెర్రి నవ్వు నోటికి పులుముకుని పేపర్ అక్కడే ఉంచేసి లోపలి వెళ్ళిపోయింది. 

మొత్తానికి అలా రెడ్ హ్యాండెడ్ గా పేపర్ దొంగని పట్టుకున్నాను. కానీ ఏం లాభం పేపర్ దొంగని మానిటర్ చెయ్యడానికి పేపర్ ఉదయాన్నే చదవడానికి నేను త్వరగా నిద్ర లేవాల్సి వస్తోంది. 

- లాస్య రామకృష్ణ