'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Showing posts with label టైటానిక్. Show all posts
Showing posts with label టైటానిక్. Show all posts

Apr 21, 2012

టైటానిక్ తెలుగులో తీస్తే హీరో ఎవరు...

టైటానిక్ 3d మూవీ చూసాను. చాలా బాగుంది. ఎంతైనా టైటానిక్ ఒక గొప్ప లవ్ స్టొరీ కదా.

కానీ నాకొక అలవాటు ఉంది. నేను ఏదైనా పరభాషా చిత్రాలు చూసినప్పుడు ఆ సినిమా తెలుగులో తీస్తే పాత్రధారులు ఎవరైతే బాగుంటుంది అని ఆలోచిస్తాను.

ఈ సినిమా చూసినంత సేపు కూడా అదే ఆలోచన. హీరో ఎవరైతే బాగుంటుంది, హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది. ఇంకా ముఖ్యపాత్రధరులుగా ఎవరిని అడగవచ్చు అని. (అదేదో నేనే సినిమా తీసేసినట్టు)


సరదాగా కాసేపు 

మరి టైటానిక్ లాంటి సినిమా ఇప్పుడు తెలుగు లో తీస్తే, ఏ ఏ పాత్రలకు ఎవరిని మీరు సూచిస్తారు.



- లాస్య రామకృష్ణ  






Apr 15, 2012

టైటానిక్ ప్రమాదం 14 ఏళ్ళ కి ముందే ఉహించినదా!!!

టైటానిక్ ప్రమాదం జరగడానికి 14 ఏళ్ళ ముందు, అమెరికన్ రచయిత మోర్గాన్ రోబెరస్టన్ ఒక నవల రచించారు. ఆ నవల పేరు Futility - The wreck of the Titan (1898). 


ఈ నవలలోని సంఘటనలకి టైటానిక్ ప్రమాదానికి ఎన్నోపోలికలున్నాయి.

ఈ నవలలోని టైటాన్ అనే బ్రిటిష్ నౌక "నార్త్ అట్లాంటా" లో ని మంచు పర్వతాన్ని ఢీ కొని మునిగిపోతుంది. టైటానిక్ కూడా 1912 ఏప్రిల్ 14 అర్ధరాత్రి మంచు పర్వతాన్ని ఢీ కొంది.

నౌకల పేర్లు కూడా చాలా దగ్గర గా ఉన్నాయి. మోర్గాన్ నవలలోని నౌక పేరు "టైటాన్" పేరు "టైటానిక్" అనే పేరుకి దగ్గరగా ఉంది. 

టైటాన్ కూడా విలాసవంతమైన అతి పెద్ద నౌక. రాజభోగాలకు దీనికి సాటి రారెవరు. టైటానిక్ కూడా విలాసవంతమైన,అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానముతో తయారుచేయబడిన అతి పెద్ద నౌక.

టైటాన్ లో 2000 మంది ప్రయాణికులు, టైటానిక్ లో 2435 మంది ప్రయాణికులు ఉన్నారు.

టైటాన్ - 3000 మంది ని తీసుకెళ్లగలిగే కెపాసిటీ గలది. టైటానిక్ - 3745 మంది ని తీసుకెల్లగలిగే కెపాసిటీ గలది.

19 'Water tight compartments' కలిగిన టైటాన్, ఒక వేళ 9 కంపార్ట్మెంట్ లు ప్రమదవసాత్తు మునిగిపోయిన తేలగలిగే శక్తి గలది. అందుకే 24 "Life boats " ఐదు వందల మందిని తీసుకెల్లగలిగే  కెపాసిటీ గలవి మాత్రమే అందుబాటులో ఉంచుకుంది. 

అదే టైటానిక్ విషయానికి వస్తే, 16 Water tight compartments కలిగినది. 20 life boats 1266 మంది ని తీసుకు వెళ్ళగలిగే కెపాసిటీ గలవి అందుబాటులో ఉంచుకుంది.

టైటాన్ కూడా ఏప్రిల్ లో నే ప్రారంభించపడింది. 

ప్రమాదం

New York నుండి England వైపు పయనిస్తున్న టైటాన్, England నుండి Newyork వైపు పయనిస్తున్న టైటానిక్ North Atlantic లో ని మంచు పర్వతాన్ని డీ కొనే మునిగిపోయాయి.



ముందే ఉహించగలిగార లేక ఇది కేవలం Coincidence మాత్రమేనా అన్నది మాత్రం మిస్టరీ గానే మిగిలిపోయింది

 - లాస్య రామకృష్ణ  










Apr 14, 2012

టైటానిక్ ఇన్ 3D

టైటానిక్ - ఈ పేరు వినగానే మనకి మొట్టమొదటగా గుర్తుకి వచ్చేది 1997 లో విడుదలైన 'టైటానిక్' మూవీ. ఈ చిత్రానికి జేమ్స్ కామెరాన్ (James Cameron) దర్సకత్వం నిర్వహించారు. 

Leonardo Dicaprio హీరో గా నటించగా, Kates Winslet హీరోయిన్ గా నటించింది. అప్పట్లో కుర్రకారు హృదయాలని Kates Winslet  దోచుకుంది. 




ఈ సినిమా ఇప్పుడు 3d లో రిలీజ్ అయింది. ఎప్పుడెప్పుడు చూస్తానా ఈ మువీని అని ఎదురుచూస్తున్నాను. మే బీ ఇవాలో రేపో వెళ్ళొచ్చు. చూసి వచ్చాక ఈ మూవీ గురించి చెప్తాను.