'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Showing posts with label బుల్లితెర ముచ్చట్లు. Show all posts
Showing posts with label బుల్లితెర ముచ్చట్లు. Show all posts

May 23, 2013

అనసూయ అవుట్ రష్మీ ఇన్


అనసూయ 
ఈ టీ వీ లో ప్రసారమవుతున్న "జబర్దస్త్" అనే కామెడీ షో తో ఒక్కసారిగా పాపులర్ అయిన అనసూయను ఆ ప్రోగ్రాం నుండి తొలగించారు. అనసూయ స్థానం లో రష్మీ గౌతం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్దమవుతోంది. 

యువ సీరియల్ లో నటించిన రష్మీ గౌతం, "ఎవరైనా ఎపుడైనా", "గణేష్" వంటి చిత్రాలలో సైడ్ క్యారెక్టర్ లు చేసింది. 

జీ తెలుగు లో సంగీతకి షాక్ ఇచ్చిన అనసూయ కు మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు మరొక యాంకర్ ని సెలెక్ట్ చేసుకుని అనసూయకు షాక్ ఇచ్చారు. 
రష్మీ గౌతం 

మరోవైపు అనసూయకు సినిమా ఆఫర్లు బాగానే వస్తున్నాయని వినికిడి. ఎక్కువగా ఐటెం సాంగ్స్ చెయ్యమని ఆఫర్స్ వస్తున్నాయట. 

మరి రష్మీ గౌతం అనసూయకు ఏ రేంజ్ లో పోటీ ఇస్తుందో చూడాలి.... 

- లాస్య రామకృష్ణ 



"అమృతం" మళ్ళీ వచ్చేస్తుందోచ్












- లాస్య రామకృష్ణ 

Mar 19, 2013

రక రకాల ఐడియాలు ఇచ్చే అంజిగాడు, ఆ ఐడియాలు విని ఉహల్లొకి వెళ్ళిపోయే అమృతం

అమృతం 


అమృతం సీరియల్ గుర్తుందా? ఒకప్పుడు బుల్లితెరలో మన నట్టింట్లోకి వచ్చి మనందరికీ హాస్యామృతాన్ని పంచి ఇచ్చిన సీరియల్ ఇది. 


గుండు హనుమంతరావు, హర్షవర్ధన్ గొప్ప వినోదాన్ని పంచేవారు. 

వీరితో పాటు రాగిణి, సర్వం కూడా హాస్యాన్ని అందించడం లో తమ వంతు పాత్ర పోషించారు. 


ఈ సీరియల్ ప్రారంభం లో శివాజీరాజా టైటిల్ రోల్ పోషించేవాడు. ఆ తరువాత సీనియర్ హీరో నరేష్ ఆ స్థానాన్ని కొద్ది ఎపిసోడ్ల వరకు భర్తీ చేయ్యగలిగాడు. 

శివాజీ రాజా, ఝాన్సీ జోడితో కొన్ని ఎపిసోడ్లు నడిచాయి. అయితే వాళ్ళు ఈ సీరియల్ నుండి మాయమయి పక్క ఛానెల్ లో "ఆలస్యం అమృతం విషం" అనే ఇంకొక కామెడీ సీరియల్ లో ప్రత్యక్షమయ్యారు . అయితే ఆ సీరియల్ కామెడీ పండించడం లో విఫలమయింది. 

ఆ తరువాత హర్షవర్ధన్ టైటిల్ రోల్ పోషించేవాడు. 

ఆల్రెడీ హిట్ టాక్ వచ్చిన సీరియల్ అందులోనీ కామెడీ సీరియల్ లో మెయిన్ రోల్ లో కొత్తగా వచ్చి ప్రేక్షకుల అభిమానాలు పొందడం చాలా కష్టం. 

ఆ కష్టాన్ని సులభం గా అధిగమించాడు హర్శవర్ధన్. ప్రత్యేకమైన తన మేనరిజం తో అమృతం పాత్రలో జీవించాడు. 

ఇక అంజిగాడు అలియాస్ ఆంజనేయులు పాత్ర పోషించిన గుండు హనుమంతరావు విషయానికి వస్తే అతనికి సరైన గుర్తింపు ఈ సీరియల్ ద్వారా కలిగిందనే చెప్పాలి. 

ఇంకొక ముఖ్యమైన క్యారెక్టర్ అప్పాజీ. 

రక రకాల ఐడియాలు ఇచ్చే అంజిగాడు, ఆ ఐడియాలు విని ఉహల్లొకి వెళ్ళిపోయే అమృతం, చివరికి ఆ అయిడియాలు విఫలమవ్వడం. 

అప్పుడప్పుడు నేను యుట్యూబ్ లో ఈ సీరియల్ చూస్తూ ఉంటాను. 

ఆనందానికి మించి భోగం ఏమి లేదు కదా. 

మీ కోసం కొంచెం అమృతం, అమృతం రుచి చుడాలంటే వీటిని క్లిక్ చెయ్యండి. 


- లాస్య రామకృష్ణ 

Mar 13, 2013

ఉమెన్స్ డే శుభాకాంక్షలు ఇలా కూడా తెలుపుతారా?


ప్రేక్షకులకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు అని ఒక సీరియల్ (కాంచన గంగ - మా టీవీ) కింద స్క్రోల్ అవుతోంది. అప్పుడు సీరియల్ లో ప్రసారమవుతున్న సన్నివేశం తన బర్త్ డే ఫంక్షన్ లో భర్త తన భార్య ని చెంపచెళ్ళుమనేల కొట్టడం. 


కనీసం ఉమెన్స్ డే రోజునైనా పగలు, ప్రతీకారాలు, కుట్రలు ఇవన్నీ పక్కన పెట్టి ఆహ్లాదకరంగా ఒక ఎపిసోడ్ ని ప్రసారం చెయ్యవచ్చు కదా!

బై డిఫాల్ట్ వాళ్ళు అలా డైరెక్ట్ చెయ్యడం అలవాటు పడ్డారేమో???
ఇలాంటి సీరియల్స్ యుగం లో కూడా కామెడీ పండించడానికి ప్రయత్నిస్తూ "గంగతో రాంబాబు" అనే సీరియల్ ని ఇంటూరి ఇన్నోవేషన్స్ బ్యానర్ పై వాసు ఇంటూరి దర్శకత్వం వహిస్తున్నాడు. 

వాసు ఇంటూరి గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. 


అమృతం సీరియల్ లో "సర్వం" గా ప్రసిద్ది చెందిన నటుడు. 

ఈ సీరియల్ అమృతం రేంజ్ లో లేకపోయినా పగలు, ప్రతీకారాలు పంధాని పక్కన పెట్టి హాస్య రసాన్ని ప్రధానంగా తీసుకున్నందువల్ల వాసు ఇంటూరి ని ప్రశంసించకుండా ఉండలేము. 

- లాస్య రామకృష్ణ 







Jan 23, 2013

ఇవాళ టీవీ ప్రోగ్రామ్స్ ఏంటో తెలుసా?














జెమిని సినిమాలు
ఉ.07.00 జీవిత చక్రం
ఉ.10.00 మా ఆయన చంటి పిల్లాడు
మ.01.00 విష్ణు
సా.04.00 మా నాన్న చిరంజీవి
సా.06.30 జానకి వెడ్స్ శ్రీరామ్
రా.09.30 బిందాస్







మా మూవీస్
ఉ.08.30 కానిస్టేబులు కూతురు
మ.12.30 పొలిటికల్ రౌడీ
సా.04.00 ఒక్కడున్నాడు
రా.07.30 స్వామి రారా 
ఆడియో రిలీజ్



జీ సినిమా
ఉ.10.55 దుల్హన్ హమ్ లేజాంగే
మ.2.20 మా తుఝే సలాం
సా.05.40 ఖల్‌నాయక్
రా.09.00 దీవార్














స్టార్‌గోల్డ్
ఉ.09.10 విధ్వంసక్
మ.12.05 కభీ ఖుషీ కభీ ఘమ్
సా.04.40 కాలో
సా.06.30 ఘర్‌వాలీ బాహర్‌వాలీ
రా.09.00 ఇండియన్
హెచ్‌బివో
మ.03.25 ఓంగ్ బ్యాక్ 3
సా.05.10 సేవ్ ద లాస్ట్ డ్యాన్స్ 2
సా.6.55 ఐపీ మ్యాన్
రా.09.00 కౌబాయ్స్ 
అండ్ ఏలియన్స్
రా.11.35 చార్లీ అండ్ ద చాక్లెట్ ఫ్యాక్టరీ
స్టార్ మూవీస్
మ.02.03 ద ట్రాన్స్‌పోర్టర్
సా.04.00 ఫ్రైట్‌నైట్
సా.06.10 ద కరాటే కిడ్
రా.09.00 రియల్ స్టీల్
రా.11.36 ఫాస్టర్
జెమిని టీవి
07.00 జెమిని వార్తలు
07.30 శుభలగ్నం
08.00 సినిమా జంక్షన్
08.15 బయోస్కోప్
08.30 నిన్నే ప్రేమిస్తా (సినిమా)
11.30 ఆహా! ఏమి రుచి
12.00 చాంగురే బంగారు రాణి
13.00 చిట్టెమ్మ
13.30 ఆహ్వనం
14.00 సంఘర్షణ
14.30 ఇంద్రాణి
15.00 బావగారు బాగున్నారా? (సినిమా)
18.00 తరంగాలు
18.30 హైస్కూల్
19.00 బంగారు కోడలు
19.30 అలామొదలైంది
20.00 అగ్నిపూలు
20.30 మొగలిరేకులు
21.00 అనుబంధాలు
21.30 దేవత
22.00 మమతల కోవెల
22.30 ఆటో భారతి
23.00 చాంగురే బంగారు రాణి





మా టీవీ
08.30 సినిమా
12.00 ‘మా’ ఊరి వంట
13.00 మోడ్రన్ మహాలక్ష్మి
14.00 నాదీ ఆడజన్మే
14.30 పవిత్ర
15.00 అత్తారిల్లు
15.30 పెళ్లంటే నూరేళ్ల పంట
16.00 అభినందన
16.30 చిగురాకులలో చిలుకమ్మా
17.30 హరహర మహాదేవ
17.30 వసంతకోకిల
18.00 కోడలా కోడలా 
కొడుకు పెళ్లామా
18.30 చూపులు కలిసిన శుభవేళ
19.00 చిన్నారి పెళ్ళికూతురు
19.30 అన్నాచెల్లెలు
20.00 మిస్సమ్మ
20.30 కాంచన గంగ
21.00 సూపర్ సింగర్
22.00 సి.ఐ.డి
23.00 కుటుంబ గౌరవం


జీ తెలుగు
07.00 గ్లోబల్ టెలీషాపింగ్
07.30 గోపురం
08.00 శ్రీకరం శుభకరం
08.30 భక్తి సమాచారం
09.00 మహాదేవి
09.30 కృష్ణావతారాలు
10.00 ముద్దుబిడ్డ
10.30 రాధా కళ్యాణం
11.00 బంగారు కుటుంబం
12.00 జీ 70 ఎమ్‌ఎమ్
12.30 మీ ఇంటి వంట
13.00 కోడి పుంజు (సినిమా)
16.30 గడసరి అత్త 
సొగసరి కోడలు
17.30 అత్తారింట్లో 
అయిదుగురు కోడళ్ళు
18.00 పునర్వివాహం
18.30 కలవారి కోడళ్లు
19.00 చిన్నకోడలు
19.30 పసుపు కుంకుమ
20.00 ముద్దుబిడ్డ
20.30 రాధాకళ్యాణం
21.00 పెళ్లినాటి ప్రమాణాలు
21.30 నారి నారి నడుమ మురారి
22.30 పౌర్ణమి










వనిత టీవీ
05.00 భక్తి గీతాలు
06.00 యాత్ర
06.30 వనిత న్యూస్
07.30 ప్రియమైన నీకు
08.00 సినిమా సినిమా
08.30 గుడ్ టైమ్
09.00 ఆమని
10.00 అభినేత్రి
10.30 సొగసుచూడతరమా
11.00 రుచిచూడు
11.30 బ్యూటీ స్పాట్
12.00 శక్తి
13.00 వనిత న్యూస్
13.30 హలో లేడీస్
14.00 నేను ఓ సినిమా తీస్తా
15.00 సంజీవని (లైవ్)
15.30 హెల్ప్‌లైన్ (లైవ్)
16.00 ఉమెన్ ఇన్ సినిమా
16.30 ఆనంద సిద్ధి
17.00 వాట్ ఎ టేస్ట్
18.00 వనిత న్యూస్
19.00 లక్కీ వనిత
19.30 బొమ్మరిల్లు
20.00 ఫిల్మ్‌నగర్
20.30 గైడ్ (లైవ్)
21.00 కరెంట్ కాజల్
21.30 వనిత న్యూస్
22.00 ఉమెన్ అలర్ట్
22.30 ఇ నౌ
23.00 మన్‌చాహేగీత్











ఎస్వీబిసి ఛానెల్
05.00 సుప్రభాత సేవ+
తోమాల సెట్ సేవ+
నిత్యపూజలివిగో
07.00 ప్రాణోపనిషత్
07.30 ప్రసన్నవదనం
08.00 ఆధ్యాత్మిక విశేషాలు
08.30 శ్రీమద్‌రామాయణం
09.00 శతమానంభవతి
09.30 విల్లిపట్టు
10.00 చార్‌దమ్ యాత్ర
10.30 అమ్మవారి కళ్యాణం
11.30 సూర్యారాధన
12.00 శ్రీవారి కళ్యాణోత్సవం
13.00 ఆధ్యాత్మిక విశేషాలు
13.30 అన్నమయ్య స్వరార్చన+
డోలోత్సవం+ 
అర్జిత బ్రహ్మోత్సవం
14.30 వసంతోత్సవం
15.00 రామానుజవాణి
15.30 సంజీవని
16.00 సాధన
16.30 శంకర విజయం
17.00 అళ్వార్‌శ్రీసూక్తి
17.20 ఎస్.డి. సేవ
18.00 నాద నీరాజనం
19.00 మహాభారత కథలు
19.30 ఘంటానాదం+
శ్రీనివాసగద్య+
నారాయణస్తోత్రం
20.00 కాశీయాత్ర
20.30 వశిష్ట విశ్వామిత్ర
21.00 శాపవిమోచనం
21.30 నాయనా
22.00 ఆధ్యాత్మిక విశేషాలు
22.30 శ్రీమద్‌రామాయణం
23.00 ప్రశ్నోపనిషత్









భక్తి టీవీ
06.00 శ్రీవిష్ణు సహస్రం
06.30 గోవిందనామాలు
07.00 అర్చన
07.30 గ్రహబలం
08.00 పుణ్యక్షేత్రం
09.00 శుభమస్తు
09.30 భక్తి విశేషాలు
10.00 రుద్రాక్షలు సందేహాలు
10.30 గ్రహవాణి
11.00 ధర్మ సందేహాలు
11.30 విజయసిద్ధి
12.00 దశావతార వైభవం
12.30 జీటీఐ న్యూమరాలజీ
13.00 హరి సంకీర్తనం
13.30 ఆముక్తమాల్యద
14.00 సౌందర్యలహరి
14.30 భక్త విజయ
15.00 విష్ణుపురాణం
16.00 ఆనంద సిద్ధి
16.30 శుభమస్తు
17.00 శ్రీలలితే నమోస్తుతే
18.00 గోవిందనామాలు
18.30 మాతా విజయేశ్వరిదేవి
19.00 భక్తి విశేషాలు
19.30 రమణానందమహర్షి
20.00 ఆంధ్రమహాభారతం
20.30 ఉత్తర రామాయణం
21.00 భాగవత కథామృతం
21.30 భక్త జయదేవ
22.00 భక్తి విశేషాలు
22.30 ధర్మసందేహాలు






స్టార్ టివీ
10.00 సాత్ నిభానా సాథియా
10.30 కాళీ
11.00 వీర
11.30 ప్యార్ కా దర్ద్ 
12.00 దియా ఔర్ బాతీ హమ్
12.30 యే రిష్తా క్యా కెహలాతా హై?
13.00 సాత్ నిభానా సాతియా
13.30 కాళీ
14.00 దియా ఔర్ బాతీ హమ్
14.30 వీర
15.00 ప్యార్ కా దర్ద్
15.30 యే రిష్తా క్యా కహ్‌లాతా హై
16.00 ముఝ్‌సే కుచ్ కెహ్‌తీ...
యే ఖామోషియాఁ
16.30 దియా ఔర్ బాతీ హమ్
17.00 సాత్ నిభానా సాథియా
17.30 నాచ్ బలియే
18.30 వీర
19.00 సాత్ నిభానా సాథియా
19.30 ముఝ్‌సే కుచ్ కెహ్‌తీ...
యే ఖామోషియాఁ
20.00 కాళీ
20.30 ఏక్ హజారో మేఁ మేరీ 
బెహనా హై
21.00 దియా ఔర్ బాతీ హమ్
21.30 యే రిష్తా క్యా కహ్‌లాతా హై?
22.00 ప్యార్ కా దర్ద్ 
22.30 వీర





టెన్ స్పోర్ట్స్
09.30 టిఐఎమ్ కప్ 2012/13: సెమీ ఫైనల్స్: 1 లెగ్ -లాజియో వర్సెస్ జువెంతుస్
11.30 యూఈఎఫ్‌ఏ ఛాంపియ న్స్ లీగ్ 2012/13: బార్సెలోనా వర్సెస్ బెన్‌ఫికా
13.30 మోటార్‌స్పోర్ట్ ముండ్యల్
14.00 మ్యాన్ సిటీ: మ్యాన్‌చెస్టర్ సిటీ వర్సెస్ పుల్హామ్
19.00 మోటార్‌స్పోర్ట్ ముండ్యల్
19.30 ఎఫ్‌ఐఎమ్ స్పీడ్‌వే 2012: ఇటాలియన్
20.30 న్యూజీల్యాండ్ టూర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా హైలైట్స్








స్టార్ క్రికెట్
12.00 ఇండియా వర్సెస్ ఇంగ్లండ్: 4వ వన్డే
21.00 ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా 2012 హైలైట్స్ 
21.30 హాకీ ఇండియా లీగ్ 2013 హైలైట్స్
22.00 కేఎఫ్‌సీ ట్వెంటీ20 బిగ్ బ్యాష్ లీగ్ 2012/13 
హైలైట్స్



- లాస్య రామకృష్ణ 

Oct 9, 2012

మెరుపు మెరిస్తే,వాన కురిస్తే,ఆకసమున హరివిల్లు విరిస్తే

అది ఒక రియాలిటీ షో. 

ఆరేళ్ళ పిల్ల ఒక పిచ్చి తల్లిలాగ అభినయించి ఆక్సిడెంట్ లో చనిపోయిన తన బిడ్డనూహించుకుంటూ పాట పాడి ప్రేక్షకులని ఆశ్చర్యపరిచింది.

ఆ అమ్మాయి అభినయిస్తున్నంత  సేపు ప్రేక్షకులు, న్యాయనిర్ణేతల కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

డాన్సు అయిపోగానే వాఖ్యాత ఆ అమ్మాయిని పొగడ్తలతో ముంచెత్తాడు.

ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ కంట నీరుతో స్టేజి మీదకి వచ్చి ప్రేమగా ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకుంది.

తనే నలుగురు పిల్లల్ని కనీ  పెంచినట్టు ఆరేళ్ళ ఆ అమ్మాయి ఏవేవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసింది. 

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో "7G బృందావన్ కాలని" లోని ఒక  "తలచి తలచి చూస్తే" అనే పాట ని పియానో తో ప్లే చేసారు.

అంతా బాగానే ఉంది, ఇక్కడ నాకర్ధం కాని విషయం చిన్న పిల్లలచేత ఇన్ని భావోద్వేగాలు పలికించాలనుకోవడం ఎంత వరకు సమంజసం.

అది డాన్సు షో. వాటిలో ఈ మధ్య చిన్నపిల్లలకి రకరకాల పాటలకు ఐటెం సాంగ్స్ కి మించిపోయేట్టు రకరకాలుగా డాన్సు స్టెప్పులు Choreograph చేస్తున్నారు. వాళ్ళ వయసు(మనసు)కి మించి వారితోటి రకరకాల భావోద్వేగాల్ని పలికిస్తున్నారు.

చిన్నపట్నించి పిల్లలకి చదువుతో పటు రక రకాల కళలపై ఆసక్తి కలిగించాలనుకోవడం అభినందించదగ్గ విషయం. కానీ వాటికే వారిని అంకితం చేయడం ఎంత వరకు న్యాయం.

పిల్లలకి వెంటనే పేరు వచ్చేయాలి అనే తాపత్రయంతో పెద్దలు పిల్లలకి జన్మ హక్కు అయిన ఒక వరాన్ని అందకుండా చేస్తున్నారు. ఆ వరం పేరే బాల్యం.అటువంటి తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి. పిల్లల్ని అందమైన బాల్యానికి దూరం చేయకండి. వారు పెద్దయ్యాక మిమ్మల్ని తెమ్మన్నా తిరిగి తేలేరు వారి 'బాల్యాన్ని'.

మహాకవి శ్రీ శ్రీ గారి కవిత మరో సారి మనం గుర్తుచేసుకుందాం.

పాపం, పుణ్యం, ప్రపంచమార్గం-
కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ
ఏమీ ఎరుగని పూవుల్లారా,
అయిదారేడుల పాపల్లారా!
మెరుపు మెరిస్తే,
వాన కురిస్తే,
ఆకసమున హరివిల్లు విరిస్తే
అవి మీకే అని ఆనందించే
కూనల్లారా!
అచ్చటికిచ్చటి కనుకోకుండా
ఎచ్చటెచటికో ఎగురుతుపోయే
ఈలలు వేస్తూ ఎగురుతుపోయే
పిట్టల్లారా!
పిల్లల్లారా!
గరికిపచ్చ మైదానాల్లోనూ,
తామరపూవుల కోనేరులలో
పంటచేలలో, బొమ్మరిళ్లలో,
తండ్రి సందిటా, తల్లి కౌగిటా,
దేహధూళితో, కచభారంతో,
నోళుల వ్రేళులు, పాలబుగ్గలూ,
ఎక్కడ చూస్తే అక్కడ మీరై
విశ్వరూపమున విహరిస్తుండే
పరమాత్మలు
ఓ చిరుతల్లారా!
మీదే, మీదే సమస్తవిశ్వం!
మీరే లోకపు భాగ్యవిధాతలు

- లాస్య రామకృష్ణ 
 

Sep 29, 2012

"మనసే మనిషికి శత్రువా"

ఈ మధ్యనే టి వి లో ఒక సీరియల్ యాడ్ చూసాను. 

"మనసే మనిషికి శత్రువా"  అనే కాప్షన్ తో సా........గుతుంది సీరియల్.

అయితే ప్రత్యేకించి ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. 

ముఖ్య పాత్రధారిణి (ఆవిడ పేరు తెలియదు), నాగేంద్రబాబు భార్య పాత్ర పోషిస్తున్న ఆవిడ నటన చూస్తుంటే మాత్రం తెగ నవ్వొస్తుంది. కామెడీ రోల్ అనుకునేరు, కాదు చాలా సీరియస్ రోల్.

ప్రోమోస్ లో కొన్ని సన్నివేశాలలో డైలాగు

"ప్రేమంతా మికే పంచాలా నేను పంచను" అనే డైలాగుని ఆవిడ చెప్పిన రీతి చుస్తే  జన్మలో మరచిపోలేరు.

- లాస్య రామకృష్ణ 


Jan 14, 2012

Reverse Quiz Game Show

నేను నిన్న సాక్షి టీవీ లో రాత్రి 8:30 కి ప్రసారమైన గ్రాండ్ మాస్టర్ ప్రోగ్రాం (Reverse Quiz Game Show) చూసాను. చాలా కొత్త కాన్సెప్ట్.   పార్టిసిపంట్ మనసులో అనుకున్న సెలెబ్రిటి పేరుని గ్రాండ్ మాస్టర్ DR.G.S.Pradeep కనిపెట్టేస్తారు. అయితే  ఈ క్రమంలో అతను  పార్టిసిపంట్ ని  కొన్ని  ప్రశ్నలు  అడుగుతారు . వాటికీ  వారు   కేవలం 'Yes'  or 'No' సమాధానాలు మాత్రమే  చెప్పాలి.

ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే స్వతహాగా నాకున్న అభిరుచి వల్ల నేను 'గ్రాండ్ మాస్టర్', పార్టిసిపంట్ ని అడిగిన ప్రశ్నలు నోట్ చేసుకున్నాను. మీకోసం ఆ ప్రశ్నలు. 


ఒక సెలెబ్రిటి గురించి గ్రాండ్ మాస్టర్ పార్టిసిపంట్ ని అడిగిన ప్రశ్నలు, పార్టిసిపంట్ సమాధానాలు.

గ్రాండ్ మాస్టర్ -              ఆ వ్యక్తి పురుషుడా 
పార్టిసిపంట్ -                  ఎస్
గ్రాండ్ మాస్టర్ -              బ్రతికే ఉన్నాడా 
పార్టిసిపంట్-                   నో
గ్రాండ్ మాస్టర్ -              భారతీయుడా
పార్టిసిపంట్-                   ఎస్
గ్రాండ్ మాస్టర్-               దక్షిణ భారతీయుడా
పార్టిసిపంట్-                   ఎస్
గ్రాండ్ మాస్టర్ -              ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవాడా
పార్టిసిపంట్ -                  ఎస్
గ్రాండ్ మాస్టర్-               సహజ మరణమా
పార్టిసిపంట్-                   నో
గ్రాండ్ మాస్టర్-               1950 తర్వాత మరణించాడా
పార్టిసిపంట్                    నో
గ్రాండ్ మాస్టర్                1900 తర్వాత మరణించాడా
పార్టిసిపంట్                    ఎస్
గ్రాండ్ మాస్టర్                స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొన్నాడా
పార్టిసిపంట్                    ఎస్
గ్రాండ్ మాస్టర్                1925 తర్వాత మరణించాడా
పార్టిసిపంట్                    నో
గ్రాండ్ మాస్టర్                తుపాకీ తో కాల్చబడి చంపబడ్డాడ
పార్తిసిపంట్                    ఎస్
గ్రాండ్ మాస్టర్                పన్ను ఎందుకు కట్టాలని ఎదురుతిరిగాడా
పార్టిసిపంట్                    ఎస్
గ్రాండ్ మాస్టర్                పల్నాడు విప్లవంతో సంబంధం ఉన్న వ్యక్తా
పార్తిసిపంట్                      నో
గ్రాండ్ మాస్టర్                   అతని పేరులో 'H' అనే అక్షరం ఉందా
పార్టిసిపంట్                    నో
గ్రాండ్ మాస్టర్                50 ఏళ్ళ తర్వాత మరణించారా
పార్టిసిపంట్                     నో
గ్రాండ్ మాస్టర్                 'R' అనే అక్షరం అతని పేరులో ఉందా
పార్టిసిపంట్                    ఎస్
గ్రాండ్ మాస్టర్                అతను ఏ అమ్మాయినైన ప్రేమించాడా
పార్టిసిపంట్                    ఎస్
గ్రాండ్ మాస్టర్                ఆ అమ్మాయి పేరుని తన పేరులో కలుపుకున్నాడా
పార్టిసిపంట్                    ఎస్
గ్రాండ్ మాస్టర్                అడవిలో చంపబడ్డాడా


అంతే గ్రాండ్ మాస్టర్ ఆ సెలెబ్రిటీ పేరు చెప్పేసారు. ఈ ప్రోగ్రాం చూస్తుంటే నేను చిన్నప్పుడు స్కూల్ లో ఆడుకున్న 'YES' or 'NO' ఆట గుర్తొచ్చింది.



Jan 12, 2012

నీవు రావు, నిదుర రాదు.........

నీవు రావు, నిదుర రాదు......... 

ఈ సోమవారం వచ్చిన పాడుతా తీయగా ప్రోగ్రాం లో పార్టిసిపంట్స్ అందరు మంచి పాటలు ఎంచుకుని పాడారు. ఈ ప్రోగ్రాం ద్వారా మనకు తెలియని మంచి పాటలు ఎన్నిటి గురించో మనం తెలుసుకుని ఆస్వాదించవచ్చు. అందులో ఒక అమ్మాయి "నీవు రావు, నిదుర రాదు' అనే పాట పాడింది. అ పాట నేను అదే వినడం. కానీ ఎంత బాగుంది ఆ పాట. సాహిత్యపరంగా కానీ, సంగిత పరంగా కానీ, ఆ పాట ఒక అద్బుతం. 

విరహ వేదనని ఎంత బాగా అక్షరాలలో ఏర్చి కూర్చాడు ఆ రచయిత. ఆ రచయిత పేరు నేను వినలేదు. మిస్ అయ్యాను అప్పుడు. అనుకోకుండా ఆ పాట వినడం జరిగింది. ఎలాగైనా ఆ రచయిత పేరు తెలుసుకుంటాను. నాకు నచ్చిన ఈ పాట సాహిత్యం మీ కోసం.


నీవు రావు, నిదుర రాదు 
నిలిచి పోయే ఈ రేయి.....

నీవు రావు, నిదుర రాదు 
నిలిచి పోయే ఈ రేయి.....

తారా జాబిలి ఒకటై సరసమడే ఆ రేయి......ఆ.....ఆ...
చింతా చీకటి ఒకటై చిన్నబోయే ఈ రేయి 

నీవు రావు, నిదుర రాదు 
నిలిచి పోయే ఈ రేయి.....


ఆశలు మదిలో విరిసే దోసిట విరులై కురిసే
ఆశలు మదిలో విరిసే దోసిట విరులై కురిసే
ఆలయాన చేరి చూడ ఆలయాన చేరి చూడ
స్వామి కాన రాడాయె నా స్వామి కాన రాడాయె


నీవు రావు, నిదుర రాదు 
నిలిచి పోయే ఈ రేయి.....

కౌగిలిలో ఒదిగిపోయి కలలుగనే వేళాయే...
ఎదురు చూసి ఎదురు చూసి
ఎదురు చూసి ఎదురు చూసి 
కన్నుదోయి  అలసిపోయే 

నీవు రావు, నిదుర రాదు 
నిలిచి పోయే ఈ రేయి.....

- లాస్య రామకృష్ణ.