Pages
ఎంచుకోండి..
- సరదాగా కాసేపు
- articles
- భక్తి
- హాస్యం
- బుల్లితెర ముచ్చట్లు
- అసలేమైందంటే
- బ్లాగు లోకం
- సాహిత్యం
- మదిలో మాట
- Quiz
- Songs of my wish....
- నేను
- మా నాన్నగారి రచనలు
- ఘుమఘుమలు
- టైటానిక్
- మట్లాడే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న
- మన గీతాలు
- శుభాకాంక్షలు
- తొలి చినుకు...
- ప్రియమైన బ్లాగరులకి...
- శ్రీ శ్రీ
- Information
- కలల ప్రపంచం
- ప్రచురణలు
'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.
Dec 31, 2012
Dec 16, 2012
ఎంతెంత దూరం నన్ను పో పో అన్నా
ఎటో వెళ్ళిపోయింది మనసు
సంగీతం - ఇళయరాజా
గానం - కార్తిక్
ఎంతెంత దూరం నన్ను పో పో అన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా
హే హే
ఎంతెంత దూరం నన్ను పో పో అన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా
ఎంతొద్దనా ఎంతొద్దనా
అంతంత నీ సొంతమైనా
నే నిన్ను ఎపుడై రారమ్మంటానా నేనేపుడై రారమ్మంటానా
నే నా నుండే నిన్నే పోనిస్తానా
ఎంతెంత దూరం నన్ను పో పో అన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా
ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా పో పోమన్నా
పొద్దున్నైతే సూర్యుడినై వస్తా
వెచ్చంగా నిద్దుర లేపి ఎన్నో చూపిస్తా
సందేల్లోన చంద్రున్నై వస్తా
చల్లంగా జోకొట్టేసి స్వప్నాలందిస్తా
మధ్యలో దాహాన్నై మధ్య మధ్య మోహన్నై
వెంటే ఉండి వెంటాడుతా
రోజు రోజు ఇంతే ఏ రోజైనా ఇంతే
నీడై జాది తోడై నీతో వస్తానంతే
నే నిన్ను ఎపుడై రారమ్మంటానా నేనేపుడై రారమ్మంటానా
నే నా నుండే నిన్నే పోనిస్తానా
ఎంతెంత దూరం నన్ను పో పో అన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా
ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా పో పోమన్నా
అద్దం లోన నేనే కనిపిస్తా అందాల చిందుల్లోన పూవై వినిపిస్తా
చుట్టూ ఉండి నేనే అనిపిస్తా ఆకాశం హద్దుల్లో నువ్వున్నా అడ్డోస్తా
మబ్బుల్లో మాటేసి వెన్నెల్లో వాటేసి ప్రాణాన్ని ముద్దాడుతా
ఏ జనమైనా ఇంతే పైలోకానా ఇంతే
ఆది అంతం అన్ని నేనే అవుతా అన్నీ
నే నిన్నెపుడై రారమ్మంటానా నేనేపుడై రారమ్మంటానా
నే నా నుండే నిన్నే పోనిస్తానా
ఎంతెంత దూరం నన్ను పో పో అన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా
ఎంతొద్దనా ఎంతొద్దనా
అంతంత నీ సొంతమైనా
నే నిన్ను ఎపుడై రారమ్మంటానా నేనేపుడై రారమ్మంటానా
నే నా నుండే నిన్నే పోనిస్తానా
ఎంతెంత దూరం నన్ను పో పో అన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా
- లాస్య రామకృష్ణ
మ్యూజిక్ తో మ్యాజిక్ - ఎటో వెళ్ళిపోయింది మనసు......
ఈ సినిమా పాటలు విన్న ప్రతివారు తప్పక అనే మాట
ఎటో వెళ్ళిపోయింది మనసు
ఈ సినిమాలో సంగీతం గురించి చెప్పేందుకు నాకు మాటలు చాలవు.
ఒక లైన్ లో చెప్పాలంటే
IT IS A MAGIC CREATED BY ILAYARAJA SIR
ఒక అద్భుతమైన సంగీత ప్రపంచానికి తీసుకువెళ్ళే ఈ పాటలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి.
అద్భుతమైన పాటలు, వింటూనే ఉండాలనిపించే పాటలు
- లాస్య రామకృష్ణ
Nov 18, 2012
Nov 4, 2012
శ్రీ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
శ్రీ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ (శుభ) కార్యేషు సర్వదా
- లాస్య రామకృష్ణ
Oct 31, 2012
పెర్షియా మిద దాడి చేసిన అరబ్స్, సౌతేర్న్ యూరోప్ కి ఈ ఆటని తీసుకెళ్ళారు.
చదరంగం ఆటలో కిక్కు నాకిన్నాళ్ళు అర్ధం కాలేదు. ఒక సారి నేర్చుకున్నాక ఇక చదరంగం అట అపాలనిపించదు

ఈ మధ్యనే నేని గేమ్ నేర్చుకున్నాను. సో ఈ అట బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకొవాలనిపించిది. అఫ్ కోర్సు, చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ లో చదరంగం గురించి ఒక లెస్సన్ ఉండేది. కానీ అప్పుడంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. కానీ ఒక సారి గేమ్ లో ఇన్వాల్వ్ అయ్యాక ఇది ఒక వ్యసనం ల మనల్ని వెంటాడుతుంది (నన్ను). అంటే అంత ఇంటరెస్టింగ్ గా ఉంటుందన్న మాట ఈ ఆట.
కాబట్టి సరదాగా ఈ ఆట గురించి నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను.
చదరంగానికి 1500 ఏళ్ల చరిత్ర ఉంది. భారత దేశం లో నే ఈ ఆట ప్రాణం పోసుకుందని చరిత్ర చెబుతోంది. చదరంగాన్ని చతురంగ అని పిలిచేవారు. ఇక్కడి నుండి పెర్షియా కి వ్యాప్తించింది. పెర్షియా మిద దాడి చేసిన అరబ్స్, సౌతేర్న్ యూరోప్ కి ఈ ఆటని తీసుకెళ్ళారు. వర్తమాన కాలంలో వాడుకలో ఉన్న చదరంగం ఆట పరిణామక్రమంలో యూరోప్ లోని 15వ శతాబ్దంలో రూపుదిద్దుకుంది.
19వ శతాబ్దం ద్వితియార్ధం లో ఆధునిక చదరంగం పోటీలు ప్రారంభమయ్యాయి(Modern chess tournament). మొట్టమొదటి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 1886 లో నిర్వహించబడినది. 20వ శతాబ్దంలో వరల్డ్ చెస్ ఫెడరేషన్ (World Chess Federation) ఏర్పడింది.
19వ శతాబ్దం ద్వితియార్ధం లో ఆధునిక చదరంగం పోటీలు ప్రారంభమయ్యాయి(Modern chess tournament). మొట్టమొదటి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 1886 లో నిర్వహించబడినది. 20వ శతాబ్దంలో వరల్డ్ చెస్ ఫెడరేషన్ (World Chess Federation) ఏర్పడింది.
లాస్య రామకృష్ణ
Oct 24, 2012
విజయ దశమి కథలు
సరదాగా దసరా వెనుక కథలు ఒక సారి గుర్తుతెచ్చుకుందామా
అజ్ఞాత వాసం పూర్తి
ద్వాపర యుగంలో పాండవులు కౌరవుల చేతిలో ఓడిపోయారు. పందెంలో షరతు ప్రకారం, పాండవులు పన్నెండేళ్ళ వనవాసాసంలో , ఒక సంవత్సరం అజ్ఞాత వాసంలో గడపాలి. పన్నెండేళ్ళ వనవాసం తర్వాత విరాట రాజు కొలువులోకి అజ్ఞాత వాసం గడిపేందుకు వెళ్ళే ముందు పాండవులు తమ ఆయుధాలని శమ్మి చెట్టు కున్న తొర్రలో దాచి ఉంచుతారు. అజ్ఞాత వాసం పూర్తి కాగానే, విజయ దశమి రోజున తమ ఆయుధాలని శమ్మి చెట్టు మీంచి తీసుకుని, తామెవరో తెలియచేసి, విరాట రాజు ని కూడా మోసపరచిన కౌరవుల తో పోరాడి విజయం సాధిస్తారు.
ఆరోజు నుండి శమ్మి ఆకులు విజయానికి, మంచికి చిహ్నంగా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయం కనిపిస్తూనే ఉంది. ఆయుధాలను, శమ్మి చెట్టును దసరా నాడు పూజిస్తారు.
మహిషాసరుడు ని వధించిన మహా శక్తి
కొందరు రాక్షసులు దేవతలపై యుద్ధం ప్రకటించి, వేధిస్తూ స్వర్గాన్ని కైవసం చేసుకోవాలని భావించేవారు. అటువంటి రాక్షసుడే మహిషాసురుడు. అల్లకల్లోలం సృష్టించసాగాడు. మహిషాసరుడి అండతో మిగతా రాక్షసులు కూడా దేవతలను ఓడించారు. బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు కూడా మహిషాసురుడిని ఎదిరించలేకపోయారు.
ఆ రాక్షసుడి నిరంకుశత్వం తో ముల్లోకాలూ నాశనం కాసాగాయి. పరిస్తితి విషమించడంతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మహిషాసురుడిని అంతం చెయ్యడానికి తమ శక్తులన్నీ కలిపి "శక్తి" గా మారారు. మహా శక్తి దుర్గా దేవి ఈ విధంగా అవతరించింది.
మహిషాసురుడితో తొమ్మిది రోజుల పాటు భీకరమైన యుద్ధం చేసింది మహాశక్తి దుర్గా దేవి. పదవ రోజున, అశ్వినా శుక్ల పక్షం నాడు, మహిషాసురుడు చంపబడ్డాడు. ప్రపంచానికి పట్టిన దుష్ట శక్తి అంతరించింది.
మహిషాసురుడి పై దుర్గా దేవి విజయాన్ని అందరూ సంతోషంగా "దసరా" పండగగా చేసుకుంటారు.
రావణుడి పై రాముడి విజయం
మహిషాసరుడు ని వధించిన మహా శక్తి
కొందరు రాక్షసులు దేవతలపై యుద్ధం ప్రకటించి, వేధిస్తూ స్వర్గాన్ని కైవసం చేసుకోవాలని భావించేవారు. అటువంటి రాక్షసుడే మహిషాసురుడు. అల్లకల్లోలం సృష్టించసాగాడు. మహిషాసరుడి అండతో మిగతా రాక్షసులు కూడా దేవతలను ఓడించారు. బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు కూడా మహిషాసురుడిని ఎదిరించలేకపోయారు.
ఆ రాక్షసుడి నిరంకుశత్వం తో ముల్లోకాలూ నాశనం కాసాగాయి. పరిస్తితి విషమించడంతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మహిషాసురుడిని అంతం చెయ్యడానికి తమ శక్తులన్నీ కలిపి "శక్తి" గా మారారు. మహా శక్తి దుర్గా దేవి ఈ విధంగా అవతరించింది.
మహిషాసురుడితో తొమ్మిది రోజుల పాటు భీకరమైన యుద్ధం చేసింది మహాశక్తి దుర్గా దేవి. పదవ రోజున, అశ్వినా శుక్ల పక్షం నాడు, మహిషాసురుడు చంపబడ్డాడు. ప్రపంచానికి పట్టిన దుష్ట శక్తి అంతరించింది.
మహిషాసురుడి పై దుర్గా దేవి విజయాన్ని అందరూ సంతోషంగా "దసరా" పండగగా చేసుకుంటారు.
రావణుడి పై రాముడి విజయం
విష్ణుమూర్తి ఏడవ అవతారం అయిన శ్రీ రామచంద్రుడు త్రేతాయుగంలో సీతాదేవిని అపహరించిన రావణాసురుడిని తన సోదరుడు లక్ష్మణుడు, బంటు హనుమంతుడు మరియు వానరసేన సహాయంతో పది రోజుల పాటు సాగిన భీకరమైన యుద్ధం తరువాత అంతమొందిస్తాడు.
రావణుడిని అంతమొందించడానికి దుర్గా దేవి ఆశీస్సులు చండీ హోమం ద్వారా శ్రీరాముడు అందుకున్నాడు. తద్వారా రావణుడి రాజ్యం లంక లోనే రావణాసురుడు చంపబడ్డాడు.
పిమ్మట, సీతా రామ లక్ష్మణులు అయోధ్యకి అశ్విన శుక్ల దశమి నాడు అడుగుపెట్టారు. రావణుడి పై రాముడి విజయానికి సంకేతంగా "విజయ దశమి " జరుపుకుంటారు.
అంతే కాదు, రావణాసురుడు, కుంభకర్ణుడు మరియు మేఘానందుడి ఎత్తైన విగ్రహాలను నిలిపి ప్రజలు పండుగ వేడుకలలో భాగంగా ఈ దసరా పది రోజులు ఆ విగ్రహాలను కాల్చివేస్తారు.
విజయ దశమి సందర్భంగా నా ఈ బ్లాగు వందటపాలు దాటినందుకు నా శ్రేయాభిలాషులందరికి హృదయపూర్వక ధన్యవాదములు.
విజయ దశమి సందర్భంగా నా ఈ బ్లాగు వందటపాలు దాటినందుకు నా శ్రేయాభిలాషులందరికి హృదయపూర్వక ధన్యవాదములు.
అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు.
- లాస్య రామకృష్ణ
Oct 23, 2012
నవరాత్రులలో తొమ్మిదవ రోజు
మాతా సిద్ధిధాత్రి
నవరాత్రులలో తొమ్మిదవ రోజున మాతా సిద్ధిధాత్రిని కొలుస్తారు. అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకమ్య, లిశిత్వ మరియు వశిత్వ అనబడు ఎనిమిది సిద్దులని మాత ప్రసాదిస్తుంది. మాతని పూజించడం ద్వారా పరమశివుడు ఈ ఎనిమిది సిద్దులను గెలుచుకున్నాడు. అమ్మ కృప వలన, పరమ శివుని శరీరం సగం అమ్మవారిగా మారి, "అర్ధనారీశ్వరుడు " గా పూజింపబడుతున్నాడు. అమ్మవారి వాహనం సింహం. అమ్మవారు కలువ పూవు పై ఆసీనులై ఉంటారని కుడా ప్రసిద్ది. దేవుళ్ళు, ఋషులు, మునీశ్వరులు, సిద్ధ యోగులు, ఇలా అందరిచేత అరాధించబడిన దేవత సిద్ధిధాత్రి.
- లాస్య రామకృష్ణ
Oct 22, 2012
Oct 21, 2012
నవరాత్రులలో ఆరవ రోజు
కాత్యాయని మాత
నవరాత్రులలో ఆరవ రోజున కాత్యాయని మాతని ఆరాధిస్తారు. కాత్యాయనుడు దుర్గా మాతని తన పుత్రికగా జన్మించమని కోరాడు. కాత్యాయనుడి తపస్సుకి మెచ్చి కాత్యయనుడి కి దుర్గా మాత పుత్రిక గా జన్మించింది. అందుకే కాత్యాయనీ మాత అని పేరు వచ్చింది.
కాత్యాయని మాత మూడు కళ్ళు, నాలుగు చేతులు కలిగి ఉంటారు. ఒక చేతిలో ఆయుధం, ఒక చేతిలో కలువ పువ్వు ఉండగా, మరో చేతిని అభయహస్తంగా చూపిస్తూ, మరో చేతిని వరాలు ప్రసాదించే విధంగా దర్శనం ఇస్తారు. వాహనం సింహం.
శ్రీ కృష్ణుడు తమ భర్తగా రావాలని గోపికలు కాత్యాయని మాతని ఆరాదించారని ప్రసిద్ది.
మాతా కాత్యయనిని ఆరాధించడం ద్వారా సకల శుభములు జరుగుతాయి. ముఖ్యంగా పెళ్ళికాని వారు కాత్యాయని వ్రతం చేస్తే త్వరగా వివాహం జరుగుతుంది.
- లాస్య రామకృష్ణ
Oct 20, 2012
నవరాత్రులలో అయిదవ రోజు
స్కంద మాత
నవరాత్రులలో అయిదవ రోజు స్కంద మాతని పూజిస్తారు. తన పుత్రుడు 'స్కంద' ని తన తొడ పై కూర్చోపెట్టుకుని ఉంటారు. అమ్మవారికి మూడు కళ్ళు మరియు నాలుగు చేతులు. రెండు చేతులలో కలువ పూవులు కలిగి ఉండగా, మరో రెండు చేతులు వరాన్ని ప్రసాదించేవిగా మరియు అభయహస్తంగా ఉంటాయి. స్కంద మాత దయ వల్ల ఒక పామరుడు కూడా పండితుడిగా మారిపోతాడు అని ప్రసిద్ది. మహాకవి కాళిదాసు మీద స్కందమాత దయ అపారం. అమ్మవారి వాహనం సింహం.
- లాస్య రామకృష్ణ
Oct 19, 2012
Oct 18, 2012
నవరాత్రులలో మూడవ రోజు
మాత చంద్రఘంట
నవరాత్రులలో మూడవ రోజున మాత చంద్రఘంటను కొలుస్తారు. మాత ప్రకాశవంతమైన వదనం కలవారు. వాహనం పులి. పది చేతులు, మూడు నయనాలు కలిగిన అమ్మవారు చంద్రఘంట మాత. ఎనిమిది చేతులలో ఆయుధాలు కలిగి ఉంటారు. ఒక చేయి వరాన్ని ప్రసాదించడానికి మరొక చేయి ఎటువంటి హాని తన భక్తులకు కలగకుండా అభయం ఇస్తున్నట్టు గా ఉంటారు.
నవరాత్రులలో మూడవ రోజున మాత చంద్రఘంటను కొలుస్తారు. మాత ప్రకాశవంతమైన వదనం కలవారు. వాహనం పులి. పది చేతులు, మూడు నయనాలు కలిగిన అమ్మవారు చంద్రఘంట మాత. ఎనిమిది చేతులలో ఆయుధాలు కలిగి ఉంటారు. ఒక చేయి వరాన్ని ప్రసాదించడానికి మరొక చేయి ఎటువంటి హాని తన భక్తులకు కలగకుండా అభయం ఇస్తున్నట్టు గా ఉంటారు.
- లాస్య రామకృష్ణ
Oct 17, 2012
Oct 16, 2012
నవరాత్రులలో మొదటి రోజు
'నవ' అనగా తొమ్మిది 'రాత్రి' అనగా రాత్రులు అని అర్ధం. నవరాత్రి అనగా తొమ్మిది రాత్రులు. మహాశక్తి దుర్గాదేవిని మనం ఈ తొమ్మిది రాత్రులు తొమ్మిది రూపాలలో కొలుస్తాము.
ప్రథమాశైలపుత్రి, ద్వితీయా బ్రహ్మచారిణీ
తృతీయాచంద్రఘంటీతి, కూష్మాండేతి చతుర్థికీ
పంచమా స్కందమాతేతి షష్టాకాత్యాయనేతి చ
సప్తమా కాళరాత్రిచ అష్టమాచాతి భైరవీ
నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా
తృతీయాచంద్రఘంటీతి, కూష్మాండేతి చతుర్థికీ
పంచమా స్కందమాతేతి షష్టాకాత్యాయనేతి చ
సప్తమా కాళరాత్రిచ అష్టమాచాతి భైరవీ
నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా
నవరాత్రులలో మొదటి రోజు
పర్వత రాజు కుమార్తె శైలపుత్రి. అమ్మవారి తొమ్మిది అవతారాలలో మొదటి అవతారం. ముందుజన్మలో ఈవిడ దక్షుని కుమార్తె. మాత శైలపుత్రి ని పార్వతి దేవిగా కూడా కొలుస్తారు, శివునిని వరించింది. నవరాత్రులలో మొదటి రోజున త్రిశూలధారిణి పార్వతి దేవిని కొలుస్తారు. వామ హస్తంలో కలువ పువ్వు కలిగి ఉంటారు.ఆహ్లాదకరమైన చిరునవ్వుతో దర్సనమిస్తారు. ఆవిడ వాహనం 'ఎద్దు'.
- లాస్య రామకృష్ణ
Oct 15, 2012
శ్రీ సాయిబాబా వారి ఏకాదశ సూత్రములు
2.ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి, ద్వారకామాయి ప్రవేశించినంతనే సుఖ సంపదలు పొందగలరు.
3.నా భౌతికదేహానంతరం నేను అప్రమత్తుడను.
4.నా భక్తులకు రక్షణము నా సమాధి నుండి వెలువడుచుండును
5.నా సమాధి నుండి నా మానుష శరీరము మాట్లాడును.
6.నన్ను ఆశ్రయించిన వారిని, నా శరణు జొచ్చినవారిని రక్షించుటయే నా కర్తవ్యం.
7.నా సమాధి నుండియే నేను సర్వ కార్యములు నిర్వహింతును.
8.నా యందు ఎవరికీ దృష్టియో వారి యందే నా కటాక్షము.
9.మీ భారములు నా పై వుంచుడు. నేను భరించెదను.
10.నా సహాయముగాని, సలహాను గాని కోరిన తక్షణమే ఒసంగెదను.
11.నా భక్తుల ఇంట లేమి అనునదియుండదు.
సేకరణ
-లాస్య రామకృష్ణ
Oct 13, 2012
ఈ చిన్నారులకు సాయం చేయండి
మానవ సేవే మాధవ సేవ
దయచేసి ఈ పోస్ట్ ని చదివి ఈ చిన్నారులకు సాయం చేయండి. వీరి గురించి మరింత మందికి తెలియజేయండి.
లంకె - ఈ చిన్నారులకు సాయం చేయండి
దయచేసి ఈ పోస్ట్ ని చదివి ఈ చిన్నారులకు సాయం చేయండి. వీరి గురించి మరింత మందికి తెలియజేయండి.
లంకె - ఈ చిన్నారులకు సాయం చేయండి
- లాస్య రామకృష్ణ.
Oct 9, 2012
మెరుపు మెరిస్తే,వాన కురిస్తే,ఆకసమున హరివిల్లు విరిస్తే
అది ఒక రియాలిటీ షో.
ఆరేళ్ళ పిల్ల ఒక పిచ్చి తల్లిలాగ అభినయించి ఆక్సిడెంట్ లో చనిపోయిన తన బిడ్డనూహించుకుంటూ పాట పాడి ప్రేక్షకులని ఆశ్చర్యపరిచింది.
ఆ అమ్మాయి అభినయిస్తున్నంత సేపు ప్రేక్షకులు, న్యాయనిర్ణేతల కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
డాన్సు అయిపోగానే వాఖ్యాత ఆ అమ్మాయిని పొగడ్తలతో ముంచెత్తాడు.
ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ కంట నీరుతో స్టేజి మీదకి వచ్చి ప్రేమగా ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకుంది.
తనే నలుగురు పిల్లల్ని కనీ పెంచినట్టు ఆరేళ్ళ ఆ అమ్మాయి ఏవేవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసింది.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో "7G బృందావన్ కాలని" లోని ఒక "తలచి తలచి చూస్తే" అనే పాట ని పియానో తో ప్లే చేసారు.
అంతా బాగానే ఉంది, ఇక్కడ నాకర్ధం కాని విషయం చిన్న పిల్లలచేత ఇన్ని భావోద్వేగాలు పలికించాలనుకోవడం ఎంత వరకు సమంజసం.
అది డాన్సు షో. వాటిలో ఈ మధ్య చిన్నపిల్లలకి రకరకాల పాటలకు ఐటెం సాంగ్స్ కి మించిపోయేట్టు రకరకాలుగా డాన్సు స్టెప్పులు Choreograph చేస్తున్నారు. వాళ్ళ వయసు(మనసు)కి మించి వారితోటి రకరకాల భావోద్వేగాల్ని పలికిస్తున్నారు.
చిన్నపట్నించి పిల్లలకి చదువుతో పటు రక రకాల కళలపై ఆసక్తి కలిగించాలనుకోవడం అభినందించదగ్గ విషయం. కానీ వాటికే వారిని అంకితం చేయడం ఎంత వరకు న్యాయం.
పిల్లలకి వెంటనే పేరు వచ్చేయాలి అనే తాపత్రయంతో పెద్దలు పిల్లలకి జన్మ హక్కు అయిన ఒక వరాన్ని అందకుండా చేస్తున్నారు. ఆ వరం పేరే బాల్యం.అటువంటి తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి. పిల్లల్ని అందమైన బాల్యానికి దూరం చేయకండి. వారు పెద్దయ్యాక మిమ్మల్ని తెమ్మన్నా తిరిగి తేలేరు వారి 'బాల్యాన్ని'.
మహాకవి శ్రీ శ్రీ గారి కవిత మరో సారి మనం గుర్తుచేసుకుందాం.
పాపం, పుణ్యం, ప్రపంచమార్గం-
కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ
ఏమీ ఎరుగని పూవుల్లారా,
అయిదారేడుల పాపల్లారా!
మెరుపు మెరిస్తే,
వాన కురిస్తే,
ఆకసమున హరివిల్లు విరిస్తే
అవి మీకే అని ఆనందించే
కూనల్లారా!
అచ్చటికిచ్చటి కనుకోకుండా
ఎచ్చటెచటికో ఎగురుతుపోయే
ఈలలు వేస్తూ ఎగురుతుపోయే
పిట్టల్లారా!
పిల్లల్లారా!
గరికిపచ్చ మైదానాల్లోనూ,
తామరపూవుల కోనేరులలో
పంటచేలలో, బొమ్మరిళ్లలో,
తండ్రి సందిటా, తల్లి కౌగిటా,
దేహధూళితో, కచభారంతో,
నోళుల వ్రేళులు, పాలబుగ్గలూ,
ఎక్కడ చూస్తే అక్కడ మీరై
విశ్వరూపమున విహరిస్తుండే
పరమాత్మలు
ఓ చిరుతల్లారా!
మీదే, మీదే సమస్తవిశ్వం!
మీరే లోకపు భాగ్యవిధాతలు
కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ
ఏమీ ఎరుగని పూవుల్లారా,
అయిదారేడుల పాపల్లారా!
మెరుపు మెరిస్తే,
వాన కురిస్తే,
ఆకసమున హరివిల్లు విరిస్తే
అవి మీకే అని ఆనందించే
కూనల్లారా!
అచ్చటికిచ్చటి కనుకోకుండా
ఎచ్చటెచటికో ఎగురుతుపోయే
ఈలలు వేస్తూ ఎగురుతుపోయే
పిట్టల్లారా!
పిల్లల్లారా!
గరికిపచ్చ మైదానాల్లోనూ,
తామరపూవుల కోనేరులలో
పంటచేలలో, బొమ్మరిళ్లలో,
తండ్రి సందిటా, తల్లి కౌగిటా,
దేహధూళితో, కచభారంతో,
నోళుల వ్రేళులు, పాలబుగ్గలూ,
ఎక్కడ చూస్తే అక్కడ మీరై
విశ్వరూపమున విహరిస్తుండే
పరమాత్మలు
ఓ చిరుతల్లారా!
మీదే, మీదే సమస్తవిశ్వం!
మీరే లోకపు భాగ్యవిధాతలు
- లాస్య రామకృష్ణ
Oct 7, 2012
ప్రముఖ సంస్థ నిర్మించబోయే ఒక మెగా డైలీ సీరియల్ కి కెమెరామెన్ కావలెను
అర్హతలు :-
- అక్షరాలూ చదవగలిగే జ్ఞానం చాలు.
- వయసుతో నియమం లేదు.
- చాలా ఓపిక గలవారు సహనం గలవారికి ప్రాముఖ్యత.
- హఠాత్తుగా వచ్చే కెమెరా ఎఫ్ఫెక్ట్స్ తో జనాలకి గుండెదడ వచ్చేలా పిక్చరైజ్ చెయ్యగలగాలి.
- అందంగా లేని నటులను సైతం అందం గా చిత్రికరించగలగాలి.
- అందంగా ఉన్న నటులను సైతం వారి పాత్రల ప్రకారం అసహ్యంగా చిత్రికరించగలగాలి.
- డైలీ సీరియల్ గనక జనాలకి బోర్ కొట్టకుండా చిత్రీకరణ సాగాలి.
- హారర్ సినిమా లు తీయడంలో అనుభవం కలిగిన కెమెరామెన్ లకి ప్రాముఖ్యం ఇవ్వబడును.
- కెమెరాని ఎన్ని రకాలుగా పడితే అన్ని రకాలుగా వాడడం తెలిస్తే వారికి మరికొన్ని రాబోయే ప్రాజెక్ట్స్ లో కూడా అవకాశం ఇవ్వబడును.
- కొన్ని ఎపిసోడ్స్ కథ లేకుండా నడవాల్సి వచ్చినప్పుడు కెమెరా మీదే సీరియల్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి, మీకు అనుభవజ్ఞులైన సీరియల్ కెమెరామెన్స్ శిక్షణ ఇస్తారు.
- లాస్య రామకృష్ణ
Oct 5, 2012
హాస్పిటల్ మిస్టరీ - ఐ సి యు లో ఉండే ఆ బెడ్ లో అడ్మిట్ అయ్యే ప్రతి పేషెంట్ కరెక్ట్ గా రాబోయే ఆదివారం ఉదయం 11.00 గంటలకల్లా ప్రాణాలు విడిచేవారు. అసలేం జరుగుతోందో ఎవరికీ అంతుబట్టడం లేదు.
అది ఒక ప్రముఖ హాస్పిటల్. ప్రపంచంలోనే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచే హాస్పిటల్. కానీ ఆ హాస్పిటల్ లో ని వీడని ఒక మిస్టరీ ఉంది.
అలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ అర్ధం కావట్లేదు.
ఐ సి యు లో ఉండే ఆ బెడ్ లో అడ్మిట్ అయ్యే ప్రతి పేషెంట్ కరెక్ట్ గా రాబోయే ఆదివారం ఉదయం 11.00 గంటలకల్లా ప్రాణాలు విడిచేవారు. అసలేం జరుగుతోందో ఎవరికీ అంతుబట్టడం లేదు.
ఆ హాస్పిటల్ లోని డాక్టర్స్ అందరిలోనూ ఒక అలజడి. ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే తాపత్రయం. సమస్య పరిష్కరించాలనే తపన. ఏవైనా మానవాతీత శక్తులు తిరుగుతున్నాయా అని అనుమానం. భయం. బెంగ...
అడ్మిట్ అయ్యే వారు ప్రత్యేకించి ఆ బెడ్ ని తప్ప వేరే బెడ్ ని కోరేవారు.
క్రమంగా హాస్పిటల్ కి జనాలు తగ్గుముఖం పట్టారు. ఇప్పటికైనా ఏం జరుగుతుందో తెలుసుకోవాలని డాక్టర్స్ టీం అంతా డిసైడ్ అయ్యారు.
ఒక ఆదివారం ఉదయం, 11:00 గంటలకి సరిగ్గా పది నిమిషాల ముందు డాక్టర్స్ అందరూ ICU బయట దాక్కుని ఈ మిస్టరీ వెనుక హిస్టరీ తెలుసుకుందామని ఎదురుచూస్తున్నారు. సమయం చక చకా పరిగెడుతోంది.
కొందరు డాక్టర్స్ దేవుడి పుస్తకాలు కుడా తెచ్చుకున్నారు.
సమయం
10:57
అందరికి ముచ్చెమటలు పడుతున్నాయి
10:58
దేవుడి ప్రార్ధనలు ఎక్కువవుతున్నాయి
10:59
గుండె దడ మరీ ఎక్కువైంది
10:59:58
ఇంకొద్ది క్షణాల్లో ఏం జరగబోతోందో ......
11:00
హాస్పిటల్ పనివాడు వచ్చి I C U లో ఉన్న లైఫ్ సపోర్ట్ సిస్టం(Life Support System) ప్లగ్ తిసేసాడు ఎందుకంటే వ్యాక్యూం క్లీనర్ (Vaccum cleaner) వాడుకోవడానికి.
- లాస్య రామకృష్ణ
Oct 3, 2012
వందేమాతరం! వందేమాతరం!
బంకించంద్ర చటర్జీ
వందేమాతరం! వందేమాతరం!
సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం !
శుభ్ర జ్యోత్స్నా పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్ !
సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం !
వందేమాతరం! వందేమాతరం!
సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం !
శుభ్ర జ్యోత్స్నా పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్ !
సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం !
వందేమాతరం! వందేమాతరం!
- సేకరణ
లాస్య రామకృష్ణ
Oct 2, 2012
గాంధీగారు చాలా మొహమాటస్తుడు
ఇవాళ గాంధీ 143 వ జయంతి. ఈ సందర్భంగా గాంధీ గారి జీవితంలో ఒక సంఘటనని ప్రస్తావించుకుందాం.
గాంధీగారు చాలా మొహమాటస్తుడు. చిన్నప్పుడు స్కూల్ అయిపోగానే సరాసరి ఇంటికి వెళ్ళిపోయేవారు. తన తోటి పిల్లలు మాత్రం ఒకరితో ఒకరు ఆడుకోవటం కానీ, మాట్లాడుకోవటం కానీ చేసేవారు. తనని ఆపి ఎక్కడ తనని అపహాస్యం చేస్తారోనన్న భయం చిన్నప్పుడు గాంధీజీకి ఉండేది.
ఇలా ఉండగా ఒకసారి Mr.Giles (ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్) గాంధీ గారి స్కూల్ ని పర్యవేక్షించడానికి వచ్చారు. పిల్లలందరికీ అయిదు పదాలు చెప్పి వాటి స్పెల్లింగ్స్ రాయమని అడిగారు. గాంధీగారు అన్ని పదాలు కరెక్ట్ గా రాసి ఒక పదం మాత్రం తప్పుగా రాసారు. ఇది అర్ధం చేసుకున్న స్కూల్ మాష్టారు గాంధీని తోటి విద్యార్ధి నుండి చూచి రాయమని సైగ చేసాడు. కానీ గాంధీ మాత్రం ఆ విధంగా చెయ్యలేదు. Mr.Giles వెళ్ళిపోయిన తర్వాత ఆ స్కూల్ మాష్టారు గాంధీని కసురుకున్నాడు.
ఇంటికి చేరుకున్న గాంధీ మాత్రం బాధపడలేదు. చినప్పట్నుంచి తను నమ్మిన విలువలకి కట్టుబడిన మహనీయుడు గాంధీజీ.
- లాస్య రామకృష్ణ
Oct 1, 2012
Sep 30, 2012
రాజకీయ జాతర
ప్రచురణ - ఆంధ్రభూమి వారపత్రిక
రచన - పి వి డి ఎస్ ప్రకాష్
ఎడతెరిపి లేని పొలిటికల్ జాతర
ఇక్కడ విలువలన్నీ నిలువునా పాతర
నేతలు కళ్ళప్పగించి చూస్తే సరా ...?
ఇపుడు డెమోక్రసీకి కావాలి ఓ ఆసరా!
ఒక్కో లీడరు మేకప్పేసుకొని యాక్టరు
కేరెక్టర్ ని డిజైన్ చేసుకునే డైరెక్టరు
అతగాడే స్క్రిప్ట్, డైలాగ్స్ రాసే రైటరు
ఆ ఎపిసోడ్లను డైలీ చూసే వ్యూయర్...పాపం ఓటరు
జనం కోసమంటూ డై'లాగుడు'
మైకు కనిపిస్తే మాత్రం చెడుగుడు
మాటలతో మభ్యపెట్టే మాయగాడు
నాలిక మడతపడినా తొణకడు బెణకడు
రాజకీయం వాడి బాబు సొత్తు
వారసత్వమే పోలిట్రిక్స్ యావత్తు
అందుకోసం గొంగళి పురుగులతో కూడా పొత్తు
'సీతాకోక'లు మారకుండానే ఎత్తు పైఎత్తులతో చిత్తు చిత్తు
పూటకో మాట... రోజుకో వేషం
మెగాస్టార్ లను దగాస్టార్ లుగా మార్చే వైనం
పదవుల కోసం తిట్టినపార్టిల్లోనే విలీనమ్
ఏదోలా పబ్బం గడుపుకోవడమే దారుణం
సమ్మెలు ఘోరావ్ లు బందులు...
జనాల్ని పీల్చి పిప్పి చేసే రాబందులు !
అడుగడుక్కీ ఇవే ఇబ్బందులు
ఖాకీ బూట్ల కవాతులు, లాఠీల చిందులు
- లాస్య రామకృష్ణ
Sep 29, 2012
"మనసే మనిషికి శత్రువా"
ఈ మధ్యనే టి వి లో ఒక సీరియల్ యాడ్ చూసాను.
"మనసే మనిషికి శత్రువా" అనే కాప్షన్ తో సా........గుతుంది సీరియల్.
అయితే ప్రత్యేకించి ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి.
ముఖ్య పాత్రధారిణి (ఆవిడ పేరు తెలియదు), నాగేంద్రబాబు భార్య పాత్ర పోషిస్తున్న ఆవిడ నటన చూస్తుంటే మాత్రం తెగ నవ్వొస్తుంది. కామెడీ రోల్ అనుకునేరు, కాదు చాలా సీరియస్ రోల్.
ప్రోమోస్ లో కొన్ని సన్నివేశాలలో డైలాగు
"ప్రేమంతా మికే పంచాలా నేను పంచను" అనే డైలాగుని ఆవిడ చెప్పిన రీతి చుస్తే జన్మలో మరచిపోలేరు.
- లాస్య రామకృష్ణ
Sep 28, 2012
రేపే ఉత్తమ టపా విడుదల ....
రేపే ఉత్తమ టపా విడుదల ....
ప్రతి శనివారం ఉత్తమ టపా తో అలరిస్తున్న బ్లాగ్లోకం మరొక ఉత్తమ టపా తో మీ ముందుకొస్తోంది....
- లాస్య రామకృష్ణ
ప్రతి శనివారం ఉత్తమ టపా తో అలరిస్తున్న బ్లాగ్లోకం మరొక ఉత్తమ టపా తో మీ ముందుకొస్తోంది....
- లాస్య రామకృష్ణ
Sep 26, 2012
భారత ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
Sep 25, 2012
దయచేసి తెలియజేయగలరు
బ్లాగు లోకం లో నాకు నచ్చిన బ్లాగులని జతపరిచాను. కానీ నేను చదవని బ్లాగులు మంచివి చాలా ఉన్నాయి. దయచేసి వాటి గురించి నాకు కామెంట్స్ లో అయిన లేక మెయిల్ (lasyaramakrishna@gmail.com) ద్వారా అయినా తెలియజేయగలరు.
- లాస్య రామకృష్ణ
Sep 23, 2012
అబ్రకదబ్ర.....
మేజిక్ - మనల్ని మంత్రముగ్దుల్ని చేసి ఆశ్చర్యానుభూతుల్ని కలిగింపచేసే కళ.
ఒక టేబుల్ మిద పడుకున్న అమ్మాయిని సడన్ గా గాలిలోకి తేలి పోయేలా ప్రేక్షకులని భ్రమింపచేయ్యడం, ఒక అమ్మాయిని ఒక డబ్బాలో పడుకోబెట్టి ఆ డబ్బాని సగానికి కట్ చెయ్యడం లాంటివి చూసినప్పుడు, మేజిక్ అంటే కనికట్టు అని తెలిసినా నేను మెజీషియన్ కి ఏవో అద్బుత విద్యలు, అతీత శక్తులు తెలుసు అని కొన్నాళ్ళ వరకు అనుకుంటూ ఉండేదాన్ని.
ఎందుకో ఇవి ట్రిక్స్ మాత్రమే అని నమ్మశక్యంగా అనిపించేది కాదు.
ఒకసారి అనుకోకుండా "మేజిక్ సీక్రెట్స్ రివీల్డ్ " అనే ప్రోగ్రాం "AXN" ఛానల్ లో చూసాను. చాలా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రాం. ముందుగా మనకి ఒక మేజిక్ ని చూపెట్టి, ఆ తర్వాత ఆ మేజిక్ వెనుక రహస్యాలు, కిటుకులు మనకు వివరిస్తారు. కానీ మెజీషియన్ ఎప్పుడు మాస్క్ లో నే కనిపిస్తాడు. ఎందుకంటే, ఇటువంటి సీక్రెట్స్ తెలియచేస్తున్నారని తెలిస్తే వారిని మెజీషియన్ కమ్యూనిటీ నుండి బహిష్కరిస్తారు.
ఒక మేజిక్ సిక్రెట్ ని మీరు చుడండి మరి ...
- లాస్య రామకృష్ణ
Sep 20, 2012
గీతా సారాంశం
అయ్యిందేదో మంచికే అయ్యింది.
అవుతున్నదేదో అదీ మంచికే అవుతుంది.
అవ్వబోయేదేదో కూడా మంచికే అవుతోంది.
నీవేమి పోగొట్టుకున్నావని నీవు విచారిస్తున్నావ్?
నీవేమి తెచ్చావని నీవు పోగొట్టుకుంటావ్?
నీవేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది.
నీవు ఏదైతే పొందావో అవి ఇక్కడ నుండే పొందావు.
ఏదైతే ఇచ్చావో ఇక్కడే ఇచ్చావు.
ఈనాడు నీవు నీ సొంతం అనుకున్నదంతా,
నిన్న ఇంకొకరి సొంతం కదా,
మరి రేపు మరొకరి సొంతం కాగలదు.
పరివర్తనం చెందడం అనేది లోకం యొక్క పోకడ.
GEETA SAAR - "THE ESSENCE OF GEETA"
Whatever happened, it happened for good
Whatever is happening, it is happening for good
Whatever that will happen, it will be for good
What have you lost for which you cry?
What did you bring with, which you have lost?
What did you produce, which has been destroyed?
You did not bring anything. when you were born.
Whatever you have, you received as a gift from Him.
Whatever you give, you will give to Him.
You came empty handed and you will go the same way.
What ever is yours today was somebody else's yesterday.
And will be somebody else's tomorrow.
Change is the Law of the Universe.
If you look at what you do not have in life,
You don't have anything.
If you look at what you have in life.
You have everything.
- సేకరణ
లాస్య రామకృష్ణ
Sep 19, 2012
మా కాలనీ లో వ్రతాల ఆంటి
Sep 18, 2012
Sep 17, 2012
బ్లాగ్ లోకానికి స్వాగతం
చాలా మంచి బ్లాగ్స్ ని చూసినప్పుడు చదివి ఎంతో ఆనందించేదాన్ని. మళ్లీ ఆ బ్లాగ్ పోస్ట్ చదవాలనిపించినప్పుడు గుర్తుకువచ్చేది కాదు. ఎంతో కష్టపడి వెతకాల్సి వచ్చేది. నేను
వెతికినా టపా దొరికితే ఎంతో ఆనందం వేసేది. అందుకనే నేనొక నిర్ణయం
తీసుకున్నాను.నాకు నచ్చిన బ్లాగ్స్ లిస్టు కోసమే ఒక బ్లాగ్
తిర్చిదిద్దుదామని అనుకున్నాను. అంటే ఇది హారానికి, మాలికకి, కూడలికి పోటీ
కాదు.
నాకు నచ్చిన బ్లాగ్స్ కోసమే ఈ బ్లాగ్ ప్రారంభించడం జరిగింది. అయితే ఇంకా
మరెన్నో ముత్యాల్లాంటి బ్లాగ్స్ ని నేను చదివి ఉండకపోవచ్చు. అలాంటి
బ్లాగ్స్ గురించి నాకు తెలియచేస్తే నేను ఇందులో జత పరుస్తాను.
అయితే ప్రతి వారం, ఈ బ్లాగు లో 'ఈ వారం ఉత్తమ టపా' గా నేను ఒక టపా గురించి ప్రస్తావిస్తాను.
నా ఈ ప్రయత్నానికి మీ అందరి ప్రోత్సాహం ఉండాలని అభిలషిస్తూ...
ఈ వారం ఉత్తమ టపా కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
ధన్యవాదములు
- లాస్య రామకృష్ణ
Sep 16, 2012
మై ఆల్ టైం ఫేవరేట్ మూవీ - గజిని
సంగీతం - హారిస్ జైరాజ్
దర్సకత్వం - మురుగుదాస్
విడుదల - నవంబర్ నాలుగు, 2005
ఈ సినిమా అంటే నాకు చాలా చాలా ఇష్టం. సుర్య చాలా అందంగా కనబడ్డాడు. ఆ తర్వాత మరే సినిమాలోను నాకు సుర్య నచ్చలేదు. అసిన్ కూడా ఈ సినిమా లోనే నచ్చింది.
ఎన్నిసార్లు ఈ సినిమా చూసానో లెక్కేలేదు. నాకు తెలిసిన వాళ్లందరికీ ఈ సినిమా చూడమని చెప్పేసాను. ఇంకా ఎవరైనా చుడనివారు ఉన్నారేమో అన్న అనుమానం వచ్చి, మన బ్లాగు వుందికదా ఇందులో రాసేద్దాం అని డిసైడ్ అయ్యా.
ఇందులో అకట్టుకునే సన్నివేశాలు ఎన్నో ...
1.సూర్య, అసిన్ కి తన ప్రేమని వ్యక్తపరిచే సీన్,
2.అసిన్ తను ఎంతో కష్టపడి కొనుక్కున్న తన కారుని అమ్మి సూర్యా వాళ్ళ అమ్మ కోసం డబ్బులిచ్చే సీన్.
2.అసిన్ తను ఎంతో కష్టపడి కొనుక్కున్న తన కారుని అమ్మి సూర్యా వాళ్ళ అమ్మ కోసం డబ్బులిచ్చే సీన్.
3. సూర్య అసిన్ కి ఒక ఫ్లాట్ ని ఓక కంపనీ ద్వారా గిఫ్ట్ గా ఇచ్చే సీన్.
ఒకటా రెండా సినిమా అద్యంతం అకట్టుకుంటుంది.
ఒకటా రెండా సినిమా అద్యంతం అకట్టుకుంటుంది.
- లాస్య రామకృష్ణ
Sep 14, 2012
ఆట
బాగా చదువుకున్నారు, మంచి ఉద్యోగాలొచ్చాయి. అయినా ఎదో అసంతృప్తి. ఎదో సాధించాలి అనే పట్టుదల. ఇవి చాలవా గమ్యం చేరుకునేందుకు.
వెంటనే వారి ఆలోచనని అమలుపరిచారు.
ఒక ప్లే జొన్ ప్రారంభించారు. తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.చిన్న వయసులోనే వ్యాపారవేత్తలుగా మారారు.
![]() |
| భోగేంద్ర |
- లాస్య రామకృష్ణ
Sep 13, 2012
Sep 11, 2012
నేను నా చిట్టి తమ్ముడు
హలో అండీ,
పెద్దలకు నమస్కారం. నా కంటే చిన్న పిల్లలకు నా ముద్దులు.
నా పేరు చైత్ర.. నాకొక తమ్ముడు. వాడి పేరు సుహాస్. నేను చాలా బుద్దిమంతురాలినన్నమాట. కాని ఎందుకో అమ్మా నాన్న నన్ను 'అల్లరి పిల్ల' అంటారు.
నిజానికి నేను అల్లరి పిల్లని కాదు. మా తమ్ముడే అల్లరి ఎక్కువ చేస్తాడు. ఫోటోలో చూడండి చాలా అమాయకంగా కనిపిస్తాడు కదూ .
అన్నట్టు చెప్పలేదు కదూ మేము విశాఖపట్నం లో ఉంటాం. మా నాన్న జర్నలిస్ట్, అమ్మ హౌస్ వైఫ్.
నేను చదువులో చాలా చురుకు. ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాను. మా తమ్ముడు సుహాస్ ఎల్ కే జీ చదువుతున్నాడు.
నాకు పాటలు వినడం చాలా ఇష్టం. మా తమ్ముడితో ఆడుకోవడం చాలా ఇష్టం. ఇలా చాలా ఇష్టాలున్నాయి.
వాడి సంగతంటారా, ఏక్షన్ మూవీస్ అంటే చాలా ఇష్టం. సినిమాలలో హీరోలు చెప్పిన డైలాగు లు వచ్చీ రాని మాటలతో చెప్తూ మమ్మల్ని భలే నవ్విస్తూ ఉంటాడు.
సింహ సినిమాలో బాలకృష్ణ డైలాగు "ఒక వైపే చూడు" లాంటివి భలే చెప్తాడు. ఇంకా, రగడ మూవీ చూసినప్పటినుంచి అనుష్కకి, ప్రియమణికి ఫ్యాన్ అయిపోయాడు.
ఇంకా మీతో చాలా విషయాలు చెప్పాలి. అమ్మేమో హోం వర్క్ చెయ్యమని పిలుస్తోంది. మళ్లీ కలుస్తాను.
- లాస్య రామకృష్ణ
Subscribe to:
Posts (Atom)






































