'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Showing posts with label బ్లాగు లోకం. Show all posts
Showing posts with label బ్లాగు లోకం. Show all posts

Apr 27, 2013

'అమాయకపు భర్త' గారి ఇంటర్వ్యూ త్వరలో బ్లాగ్ లోకం లో

'మేన్ కి ఉండాలి మేనరిజం' అంటూనే మళ్ళీ 'అంతా మాయ విష్ణు మాయ' అంటూ తప్పించుకుని తిరుగుతూ 'భామనే' అంటున్న శ్రీమతి గారికి 'పతివ్రతా పిన్నిగారి'చ్చిన సలహాల వల్ల  కొన్ని తిప్పలు పడి సరదాగా 'కలల రాణి' తో 'షాపింగ్ కాంప్లెక్స్' కి ' వెళ్ళిన 'ప్రేమ పిచ్చోడి' కి 'డాక్టర్ గారి చిట్కాలు' త్వరలో 'బ్లాగు లోకం' లో .... 

- లాస్య రామకృష్ణ 

Mar 13, 2013

ఉగాది కవితల పోటీ వివరాలు

నమస్కారం,

ప్రియమైన తెలుగు బ్లాగర్లు అందరికీ నమస్సుమాంజలి. ఉగాది పర్వదినం సందర్భంగా 'బ్లాగులోకం' లో ఉగాది కవితల పోటీ నిర్వహించదలిచాము. 
పోటీ వివరాలు

ఉగాది కవితల పోటికి తెలుగు లో బ్లాగు నడుపుతున్న ప్రతి ఒక్కరు అర్హులే.

1.'ఉగాది అప్పుడు ఇప్పుడు' లేదా 'ఉగాది' అనే అంశాలపై కవితలని ఉగాది కవితల పోటీకి ఆహ్వానిస్తున్నాం.
2.కవిత కనీసం పది లైన్లు కలిగి ఉండాలి.
3.ప్రచురితం కాని కవితలనే పంపవలెను.
4.ఒక్కొక్కరు ఎన్ని కవితలనైనా పంపవచ్చు. 
5.ఉగాది రోజున విజేతలను ప్రకటిస్తాం.
6.పోటీ కి వచ్చిన కవితల క్రెడిట్ ని ఆ రచయిత లేదా రచయిత్రులకి ఇస్తూ వీలువెంబడి ఆ కవితలను 'బ్లాగ్ లోకం' లో ప్రచురిస్తాము.
7.మీ కవితలను 'lasyaramakrishna@gmail.com' కి ఇ-మెయిల్ చెయ్యాలి.
8. మీ కవితతో పాటు మీ పేరు, మీ బ్లాగ్ లింక్ మరియు మీ పరిచయం పంపించాలి. ఇష్టమైతే పాస్ పోర్ట్ సైజు ఫొటోగ్రాఫ్ కూడా పంపించవచ్చు.
9. పోటీ కి వచ్చిన కవితలలో అర్హత పొందినవి రచయిత పరిచయంతో  బ్లాగ్ లోకం లో ప్రచురించడం జరుగుతుంది. 
10. విజేతల ఎంపికపై పూర్తి అధికారం న్యాయనిర్ణేతలదే.
11.బహుమతుల వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. 
12. ఈ పోటిలో పాల్గొనడానికి చివరి తేదీ March 15, 2013. 15 మార్చ్ 2013 సాయంత్రం 6.00 (భారతీయ కాలమానం ప్రకారం) ఈ పోటీ ముగుస్తుంది. 

త్వరపడండి మరి......

ధన్యవాదాలు
లాస్య రామకృష్ణ 

Jan 29, 2013

కవితల పోటీ లో పాల్గొనే అవకాశం బ్లాగర్లతో పాటు బ్లాగ్ వీక్షకులకు కూడా కలదు

కవితల పోటీ లో చిన్న మార్పు

కవితల పోటీ లో పాల్గొనే అవకాశం బ్లాగర్లతో పాటు బ్లాగ్ వీక్షకులకు కూడా కలదు. తెలుగు భాష పై మక్కువ ఉన్న ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొనవచ్చు. ఉగాది కవితల పోటీ కి సంబంధించిన వివరాలకు కింద ఇవ్వబడిన లంకె ని సందర్శించండి

ఉగాది కవితల పోటీ వివరాలు 

బహుమతుల వివరాలు 

- లాస్య రామకృష్ణ 

Jan 25, 2013

ఉగాది కవితల పోటీ బహుమతుల వివరాలు

మొదటి బహుమతి 

అమృతం కురిసిన రాత్రి - దేవరకొండ బాలగంగాధర తిలక్ - (ఈ బుక్)

రెండవ బహుమతి 

పరికిణీ - తనికెళ్ళ భరణి  - (ఈ బుక్ )

మూడవ బహుమతి 

పడమటి కోయిల పల్లవి - యండమూరి వీరేంద్రనాథ్ (ఈ - బుక్)

- లాస్య రామకృష్ణ 

Jan 22, 2013

ఉగాది కవితల పోటీ

నమస్కారం,

ప్రియమైన తెలుగు బ్లాగర్లు అందరికీ నమస్సుమాంజలి. ఉగాది పర్వదినం సందర్భంగా 'బ్లాగులోకం' లో ఉగాది కవితల పోటీ నిర్వహించదలిచాము. 
పోటీ వివరాలు

ఉగాది కవితల పోటికి తెలుగు లో బ్లాగు నడుపుతున్న ప్రతి ఒక్కరు అర్హులే.

1.'ఉగాది అప్పుడు ఇప్పుడు' లేదా 'ఉగాది' అనే అంశాలపై కవితలని ఉగాది కవితల పోటీకి ఆహ్వానిస్తున్నాం.
2.కవిత కనీసం పది లైన్లు కలిగి ఉండాలి.
3.ప్రచురితం కాని కవితలనే పంపవలెను.
4.ఒక్కొక్కరు ఎన్ని కవితలనైనా పంపవచ్చు. 
5.ఉగాది రోజున విజేతలను ప్రకటిస్తాం.
6.పోటీ కి వచ్చిన కవితల క్రెడిట్ ని ఆ రచయిత లేదా రచయిత్రులకి ఇస్తూ వీలువెంబడి ఆ కవితలను 'బ్లాగ్ లోకం' లో ప్రచురిస్తాము.
7.మీ కవితలను 'lasyaramakrishna@gmail.com' కి ఇ-మెయిల్ చెయ్యాలి.
8. మీ కవితతో పాటు మీ పేరు, మీ బ్లాగ్ లింక్ మరియు మీ పరిచయం పంపించాలి. ఇష్టమైతే పాస్ పోర్ట్ సైజు ఫొటోగ్రాఫ్ కూడా పంపించవచ్చు.
9. పోటీ కి వచ్చిన కవితలలో అర్హత పొందినవి రచయిత పరిచయంతో  బ్లాగ్ లోకం లో ప్రచురించడం జరుగుతుంది. 
10. విజేతల ఎంపికపై పూర్తి అధికారం న్యాయనిర్ణేతలదే.
11.బహుమతుల వివరాలు త్వరలోనే ప్రకటించబడుతుంది.
12. ఈ పోటిలో పాల్గొనడానికి చివరి తేదీ March 15, 2013. 15 మార్చ్ 2013 సాయంత్రం 6.00 (భారతీయ కాలమానం ప్రకారం) ఈ పోటీ ముగుస్తుంది. 

త్వరపడండి మరి......

ధన్యవాదాలు
లాస్య రామకృష్ణ 

Sep 28, 2012

రేపే ఉత్తమ టపా విడుదల ....

రేపే ఉత్తమ టపా విడుదల ....

ప్రతి శనివారం ఉత్తమ టపా తో అలరిస్తున్న బ్లాగ్లోకం మరొక ఉత్తమ టపా తో మీ ముందుకొస్తోంది....

                                                                                                                                      - లాస్య రామకృష్ణ 

Sep 25, 2012

దయచేసి తెలియజేయగలరు

బ్లాగు లోకం లో నాకు నచ్చిన బ్లాగులని జతపరిచాను. కానీ నేను చదవని బ్లాగులు మంచివి చాలా ఉన్నాయి. దయచేసి వాటి గురించి నాకు కామెంట్స్ లో అయిన లేక మెయిల్ (lasyaramakrishna@gmail.com) ద్వారా అయినా తెలియజేయగలరు.

- లాస్య రామకృష్ణ 

Sep 17, 2012

బ్లాగ్ లోకానికి స్వాగతం

చాలా మంచి బ్లాగ్స్ ని చూసినప్పుడు చదివి ఎంతో ఆనందించేదాన్ని. మళ్లీ ఆ బ్లాగ్ పోస్ట్ చదవాలనిపించినప్పుడు గుర్తుకువచ్చేది కాదు. ఎంతో కష్టపడి వెతకాల్సి వచ్చేది. నేను వెతికినా టపా దొరికితే ఎంతో ఆనందం వేసేది. అందుకనే నేనొక నిర్ణయం తీసుకున్నాను.నాకు నచ్చిన బ్లాగ్స్ లిస్టు కోసమే ఒక బ్లాగ్ తిర్చిదిద్దుదామని అనుకున్నాను. అంటే ఇది హారానికి, మాలికకి, కూడలికి పోటీ కాదు. 

నాకు నచ్చిన బ్లాగ్స్ కోసమే ఈ బ్లాగ్ ప్రారంభించడం జరిగింది. అయితే ఇంకా మరెన్నో ముత్యాల్లాంటి బ్లాగ్స్ ని నేను చదివి ఉండకపోవచ్చు. అలాంటి బ్లాగ్స్ గురించి నాకు తెలియచేస్తే నేను ఇందులో జత పరుస్తాను.

అయితే ప్రతి వారం, ఈ బ్లాగు లో 'ఈ  వారం ఉత్తమ టపా' గా నేను ఒక టపా గురించి ప్రస్తావిస్తాను.

 నా ఈ ప్రయత్నానికి మీ అందరి ప్రోత్సాహం ఉండాలని అభిలషిస్తూ... 
ఈ వారం ఉత్తమ టపా కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. 
ధన్యవాదములు  
- లాస్య రామకృష్ణ