'బ్లాగులోకం' లో మీ బ్లాగుని జతపరచుటకు lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

Showing posts with label అసలేమైందంటే. Show all posts
Showing posts with label అసలేమైందంటే. Show all posts

May 7, 2013

జిలేబీ గారి ఇన్స్పిరేషన్ తో లాస్య రామకృష్ణ నిర్టపా వ్రతం ఆరంభం


జిలేబీ గారి చాతుర్వార 'నిర్టపా ' వ్రతం ఆదర్శం గా తీసుకుని నేను కూడా ఒక నెల రోజులు కాదు కాదు ఒక పదిహేను రోజులు కాదు కాదు ఒక వారం పాటు "తెలుగు బ్లాగు సీ'రియల్' ముచ్చట్ల లో నిర్టపా వ్రతం అరంభిస్తున్నాను. 

మీ అందరి ప్రోత్సాహం కావాలి. 

గమనిక - ఈ వ్రతం ఈ బ్లాగు కి మాత్రమే పరిమితం. "బ్లాగ్ లోకం" లో ఈ వ్రతం పాటించట్లేదు. 

- లాస్య రామకృష్ణ 

Feb 21, 2013

అందిన ద్రాక్ష తియ్యన



ద్రాక్ష ని ఆహారం లో తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఎన్నో. అత్యంత పోషక విలువలు కలిగిన ద్రాక్ష ఆరోగ్యాన్ని అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలని నిర్మూలించడం లో ద్రాక్ష పండు ప్రధాన పాత్ర పోషిస్తుందనడం లో సందేహం లేదు. 



అజీర్ణం, మలబద్దకం, మూత్రపిండాల సమస్యలు, ఆయాసం, అలసట, నీరసం, దృష్టి లోపములు, కంటి శుక్లాల నివారణ మొదలగు సమస్యల బారిన పడకుండా ద్రాక్ష తోడ్పడుతుంది. అత్యంత రుచికరమైన పళ్ళ లో ఒకటైన ద్రాక్షలో ఎ, సి, బి6 మరియు ఫోలేట్ విటమిన్లతో పాటు పొటాషియం, కాల్సియం, ఐరన్, ఫొస్ఫరస్, మెగ్నీషియం మరియు సేలేనియం వంటి మినరల్స్ కలవు.



ద్రాక్ష వల్ల నయమయ్యే వివిధ రకాల ఆరోగ్య సమస్యలు

ఆస్థమా :- ద్రాక్షలో ఉన్న ఔషదపరమైన గుణాలు ఆస్థమాను నయం చెయ్యడానికి ఉపయోగపడతాయి. 



గుండె సంబంధిత వ్యాధులు :- రక్తం లో ని నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలని పెంచడం ద్వారా రక్తం గడ్డ కట్టడాన్ని ద్రాక్ష నిరోధిస్తుంది. అందువల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. రక్తనాళాలని అడ్డగించే చెడ్డ కొవ్వు ని నిర్మూలించడానికి కూడా ద్రాక్ష ఉపయోగపడుతుంది. 



మైగ్రేన్ : ఉదయాన్నే ద్రాక్ష రసం తీసుకోవడం వల్ల మైగ్రేన్ సమస్య నుండి బయటపడవచ్చు. 



మలబద్దకం : మలబద్దక సమస్యకు విరుగుడు ద్రాక్ష. 



అజీర్ణం : అజీర్తి ని నయం చేసేందుకు ద్రాక్ష ముఖ్య పాత్ర పోషిస్తుంది. వేడి ని తగ్గించి పొట్టకి ఉపశమనం కలిగిస్తుంది. 


ద్రాక్ష వల్ల నయమయ్యే మరికొన్ని ఆరోగ్య సమస్యల గురించి తరువాతి టపాలో తెలుసుకుందాం.... 


- లాస్య రామకృష్ణ 

Aug 28, 2012

హైదరాబాద్ వచ్చానోచ్....

మొన్ననే నేను హైదరాబాద్ వచ్చాను.


- లాస్య రామకృష్ణ 



Apr 22, 2012

హైకోర్ట్ నోటీసు - పాపం జెనిలియా


కేవలం డబ్బులు వస్తాయికదా అని ఏది పడితే దానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి ప్రజలు మోసపోవడానికి కారణం అవుతున్నారు కొంత మంది బ్రాండ్ అంబాసిడర్లు. They have to judge theirselves about the product for which they will be acting as a brand ambassador. ఇలాంటి కేర్ తీసుకోని జెనిలియా పాపం ఎలా బుక్కయ్యిందో చూడండి.


ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ జెనీలియాని ఏప్రిల్ 25 వ తారీకున కోర్ట్ కి హాజరు కమ్మని నోటిసు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే,  జెనిలియా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. ఆమె ప్రోమోట్ చెయ్యడం వల్ల ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ కి విపరీతంగా ప్రజల స్పందన లభించింది. 

నాలుగేళ్ళ క్రితం తమ దగ్గర డబ్బులు తీసుకుని కనీసం ఇప్పటికి కూడా నిర్మాణం ప్రారంభించలేదని బాధితుల ఆవేదన. బాదితులు తము జెనిలియా ప్రోమోట్ చెయ్యడం వల్లే మోసపోయామని ఆరోపిస్తున్నారు.


Apr 7, 2012

డైరీ మిల్క్ vs వెడ్డింగ్ కార్డ్!!!

ఎవరైనా మీకు 'Cadbury Dairy Milk Chocolate Bar' ఇస్తే హడావిడిగా wrapper ని తీసేసి తినాలని అనుకోకండి. మోసపోతారు. ఎందుకంటే ఇప్పుడు Wedding Card ని ప్రింట్ చెయ్యడంలో చాలా సృజనాత్మకంగా ఆలోచిస్తున్నారు.

నేను అలాగే చాక్లెట్ అని భ్రమ పడ్డాను కూడా. మిరే చదవండి.

ఇటివలే మాకు తెలిసిన వాళ్ళు పెళ్ళికి పిలవడానికి వెడ్డింగ్ కార్డు తో మా ఇంటికి వచ్చారు. వాళ్ళు ఒక కవర్లో చాలా కాడ్బరీ చాక్లెట్స్ కూడా తీసుకువచ్చారు. ఆహ్వాన పత్రికతో పాటు చాక్లెట్స్ కూడా ఇస్తారేమో అని అనుకున్నాం.

తీరా చూస్తే ఆ చాక్లేటే ఆహ్వాన పత్రిక. అచ్చు చాక్లెట్ల కనిపించేటట్టు వెడ్డింగ్ కార్డు ని డిజైన్ చేసారు. ఆ కార్డు చూసినప్పుడల్లా చాక్లెట్ తినాలని మాత్రం తప్పకుండా అనిపిస్తుంది.


మా ఇంట్లో వాళ్ళు ఆ కార్డు ని నాకు కనపడకుండా దాచేసారు.






- లాస్య రామకృష్ణ 

Feb 3, 2012

ఆమె ఎవరు???

ఏదైనా రాయాలి. గొప్పగా రాయాలి . మంచి రచయిత్రిగా పేరు తెచ్చుకోవాలి. కానీ, ఏం రాయను. దేని గురించి రాయను. కలం ముందుకి కదలట్లేదే! 

లోకం అంతా ప్రశాంతం గా ఉంది. అదేంటో ఇవాళ ఏ రాజకీయ నాయకుడు ఎవరి మీద దుమ్మేత్తలేదు. ఏ హీరోయిన్ గురించి గాస్సిప్స్ రాలేదు. ఎక్కడా సెన్సేషనల్ న్యూస్ లేదు. అరెరే ఇలా అయితే ఎలా?

ఒకే, ఇలాంటి సమయంలోనే శ్రీ శ్రీ గారిని తలచుకోవాలి. అయన పుస్తకాలు ఎక్కువ చదవక పోయినా, పెద్దగా ప్రాచుర్యంలో ఉన్న ఒక డైలాగు నాకు గుర్తుంది. అదే "కాదేది కవిత కనర్హం'. 

అవును కదా. అదే నిజం. నేనేదో సెన్సేషనల్ రచయిత్రి కావాలంటే మాత్రం ఏదైనా పెద్ద కుంభకోణం బయట పడాలా? ఎవరైనా పెద్ద హీరో కూతురు లేచిపోవాలా? అవసరమే లేదు. నేను ఎవరనుకున్నారు? ప్రముఖ న్యూస్ చానెల్స్ ని రెగ్యులర్గా ఫాలో అయ్యే ప్రేక్షకురాలిని.
కాబట్టి ఏ విషయం లేని సంఘటనకైనా నేను ఎంతో సెన్సేషన్ ని క్రియ్యేట్ చేయగలను.

రాసేస్తున్నాను. కాస్కోండి.

"అక్కడొక సామాన్య మధ్య తరగతి మహిళా రోడ్డు మీద నడచుకుంటూ వెళుతోంది. చూసారా, మన ప్రభుత్వం తీరు. ఒక మధ్య తరగతి మహిళ మండుటెండలో నడచుకుంటూ వెళుతోంది. దీనికి కారణం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే. ఒక స్త్రీ మండుటెండలో నడచుకొని వెళ్ళడమా! ఎంత దిగజారిపోతోంది మన సమాజం. ఎక్కడికి వెళుతోంది ఈ లోకం. స్త్రీలకి గౌరవం ఇవ్వడం రాను రాను తగ్గిపోతున్న ఈ సమాజం లో ధైర్యం గా ఎలా బయటికి రా గలదు ఒక స్త్రీ. 

ప్రభుత్వం ఎన్నో బస్సులను లేడీస్ స్పెషల్ గా కేటాయించినా ఈవిడ  ఇలా నడుచుకుంటూ వెళ్ళడానికి గల కారణం ఏమిటి? ప్రజలలో తగ్గిపోతున్న విలువలకి కారణం ఎవరు? ప్రజల అవసరాలకు ప్రభుత్వం కల్పించిన సదుపాయాలు అందుబాటులోకి రాకపోవడానికి కారణమెవరు? ఇదేనా స్త్రీకి మనమిచ్చే విలువ???"

మనలో మన మాట:- ఆవిడ కిరాణా షాపులోని సామాన్లు కొనుక్కొని పక్క వీధిలో నున్న తన ఇంటికి వెళుతోంది:-).

 - లాస్య రామకృష్ణ.









     

Jan 27, 2012

ఇట్లు ఓ యువతి...

మొన్నేమయిందో తెలుసా.....నేనేమో కష్ట పడి టీవీ ప్రోగ్రాం "మా ఇంటి వంట" చూసి మా ఇంట్లో ఏదో ప్రయోగం చేస్తున్నాను. అదేనండి ఆ వంట వండుతున్నాను. ఎందుకంటే, అ వంట రుచి మావారికి చూపించి, బాగుంటే నేను తిని ఇద్దరం కలిపి మూవీ కి వెళ్ళాలన్నది మా వీకెండ్ ప్లాన్. 
సరే మూవీ అనే ఒక ఆసక్తి కరమైన అంశం ఉంది కాబట్టి ఏదో ఇవాళ అయినా  కాస్త వంట బాగా చేసి మా వారి మెప్పు పొందుదామని అంత హడావిడిగా, ఏకాగ్రత తో వండుతున్నాను. సాధారణంగా, అంత ఏకాగ్రతతో వండితే పదార్ధం, ఐ మీన్ వంట బాగా కుదురుతుంది. కాని నా విషయం లో అలా జరగలేదు. ఎందుకో మీరే చదవండి...

నేను చక్కగా టీవీ లో చూపెట్టినట్టు ఉప్మా తయారు చేద్దామని అనుకుంటుండగా, మా వారి స్నేహితుడు ఉరుము ఉరిమి నట్టు అదర బాదరాగా మా ఇంటికి వచ్చాడు. ఏ నిమిషమైతే ఇతను వచ్చాడో అప్పుడు నాకర్ధమైంది ఇవాళ మూవీ కేన్సిల్ అని. ఎందుకంటే, అతను ఎప్పుడొచ్చిన ఏదో ఒక ప్రత్యేకమైన సమస్యతో మా వారి సలహా అడగడానికి వస్తాడు. మా వారు మనుషుల మనస్తత్వాన్ని బట్టి వారికి సూచనలు ఇస్తారు. పోనీ అదేదో ఆఫీసు సమస్య అంటే కానే కాదు. వాళ్ళావిడతో సమస్యట. 

ఇతను వంకాయ కూర చేస్తానంటే వాళ్ళావిడ బెండకాయ చెయ్యమందట. దాంతో ఇతని ఈగో దెబ్బతిని వంకాయ కూర వండి మరీ వచ్చాడట. అసలు సమస్య ఏమిటంటే, ఇప్పుడు ఇంటికెల్లడానికి భయపడుతున్నాడు. 

మా వారు మనసులో 'మా ఆవిడ మరీ నా ఈగో దెబ్బతీయదు. నేనేం వండినా కాం గా తింటుంది అని సంబరపడినట్టున్నారు' వెంటనే అతనితో "ఇది ఒక సమస్య. మీ భార్యభార్తలిద్దరికి అవగాహన లోపం ఉంది. కొంచెం సర్దుకుపోవాలి అని నచ్చచెప్పారు. వెంటనే 'ఏమోయి' అని నన్ను పిలిచి బెడ్రూంలోకి తీసుకెళ్ళారు. నేను కొంచెం సిగ్గుపడి ఏంటండి మరీను వేలా పాలా లేకుండా అంటే 'నీ మొహం, నేను పిలిచింది ఎందుకంటే వాడి భార్యకి నువ్వు నచ్చ చెప్పి ఎలాగోలా వీడి సమస్యను పరిష్కరించు అన్నారు. 

దాంతో, నా ఆనందానికి అవధులు లేవు. చిన్నపట్నించి, ఏదో ఒక గొప్ప పని చేసి, 'కర్తవ్యం' విజయశాంతి లాగా  హీరోయిన్ ఓరియంటెడ్ సీన్ నా లైఫ్ లో జరగాలని ఆశించాను. కానీ ఇప్పటి వరకు అలాంటి అవకాశం రాలేదు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినయోగం పరచుకోవాలన్న సదుద్దేశంతో ముందడుగు వేసాను.

ఆ సంతోషం లో నేను చేసిన ఉప్మా లో ఇడ్లి రవ్వ దర్శనమిచింది. 

కట్ చేస్తే, మేము ముగ్గురం మా వారి స్నేహితుడి ఇంటికి అతని భార్యకి నచ్చచెప్పడానికి వెళ్ళాం. అక్కడ, ఆ అమ్మాయి చాలా సేపటినుండి ఏడుస్తున్నట్టుంది కళ్ళు వాచిపోయాయి. వాల్లాయనని చూడగానే గబాలున లేచి దగ్గరకి వొచ్చి మేమున్నామని కూడా గమనించనట్టు వాటేసుకుని, 'ఏవండి, నా మీద అంత కోపమెందుకు. ఏదో బెండకాయ కూర చెయ్యమని అడిగానే అనుకోండి అలా వెళ్ళిపోవాలా. మీ మీద ప్రేమతో వంకాయ కూర మొత్తం తినేసానండి. ఇంకెప్పుడు ఇలా వెళ్ళిపోకండి. మీరేం వండినా రుచిగానే ఉంటుంది. ఐ యాం సారీ!!!" అంది. ఇద్దరు కలిసి మేము అనే ఇద్దరం మనుషులం వాళ్ళింటికి వచ్చామని మర్చిపోయి మరీ లోపలికి సంతోషంగా ఒక డ్యూయెట్ పాడుకోవడానికి వెళ్ళిపోయారు. 

మళ్లీ కట్ చేస్తే ఇడ్లీ రవ్వ ఉప్మా మా వారికి పెట్టి, సినిమాకి బయలుదేరితే అప్పటికే "హౌస్ ఫుల్ " బోర్డు అందంగా వెక్కిరించింది.

నీతి:- ఉప్మా లో ఇడ్లి రవ్వ వెయ్యకూడదు!!!

ఇట్లు ఓ యువతి.



Jan 24, 2012

తాళం తెచ్చిన తంట



నేను మా అయన కలిసి మొన్నసండే అలా బయటికి  వెళ్ళాం. మర్నాడు ఆఫీసు ఉంటుంది కదా, తొందరగా బయలుదేరి రావాలి అని మాట తీసుకుని మరీ బయలుదేరాను. 

బయటికి వెళ్తే టైం మన చేతుల్లో ఉండదు కదా. ఆ రోజు "బిజినెస్ మాన్" సినిమా చూసి, బయటే డిన్నర్ చేసి ఇంటికొచ్చేసరికి చాలా లేట్ అయింది. ఇక మర్నాడు చూడండి నా అవస్త.

ఉదయాన్నే లేచి స్నానం చేసి, దేవునికి దణ్ణం పెట్టుకుని, వంట చేసి, నాకు మా ఆయనకి లంచ్ బాక్స్ సర్దాను. ఇవాల్టికి బ్రేక్ ఫాస్ట్ కి ఉప్మా తో సరిపెట్టుకోండి అని మా శ్రీవారికి చెప్పను. ఆయనకి ఉప్మా పడదాయే!!! కానీ ఏంచేస్తాం. కొన్ని సార్లు తప్పదు కదా అని నా స్టైల్ లో బ్రతిమిలాడాను. అప్పుడు ఒప్పుకున్నారు.

క్యాబ్ వచ్చే టైం అయింది అన్ని రెడీ చేశాను కదా అని ఒక సారి చెక్ చేసుకున్నాను. అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. అప్పుడు క్యాబ్ డ్రైవర్ నుంచి ఫోన్ 'మేడం, టైర్ పంక్చర్ అరగంట లేట్ అవుతుంది' అని. సర్లే, ఏదోచ్చిన మన మంచికే కదా అని కాస్త రిలాక్స్ అవుదామనుకున్నాను. చెరొక తాళం తీసుకెళ్ళే అలవాటుండడం వాళ్ళ కాజ్యువల్ గా చూసుకున్నాను. అప్పుడు తెలిసింది, నా దగ్గర తాళం మిస్ అయ్యిందని.

ఇంక వెతుకులాట ప్రారంభం. వంటింట్లో వెతికాను. బెడ్రూం లో వెతికాను. పోపుల పెట్టెలో వెతికాను. మా అయన జేబులో వెతికాను. ఎక్కడ దొరకదాయే. ఇలా వెతుకులాట లో నే అరగంట గడిచిపోయింది. అప్పుడు, మావారు ప్రశాంతంగా పేపర్ చదువుకుంటూ కనిపించారు. 

నేను తాళం కనపడలేదని హడావిడిలో ఉంటే అయన కనీసం ఏ మాత్రం హడావిడి గా లేకుండా పేపర్ చదువుకుంటున్నారు. నా హడావిడి గమనించి నా ప్రాబ్లం ని చిటికలో సాల్వ్ చేసారు. ఎలా అంటారా.

రెగులర్గా నేను మర్చిపోయే చోటే తాళం దొరికింది. అదేనండి టీవీ రిమోట్ దగ్గర. 

ఇలా అరగంటా గడిచిపోయింది. ఈ లోపు క్యాబ్ వచ్చింది.  

- లాస్య రామకృష్ణ